వీరభారతీయ పౌరులారా! దేశమాత పిలుపు వినలేరా!
పల్లవి :
హిమాలయంలో మంటలురేగి ప్రమాద సమయం వచ్చింది
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
చరణం : 1
అంతా స్నేహితులనుకున్నాము
అందరి మేలు ఆశించాము
అందరి మేలు ఆశించాము
పరుల మంచిపై నమ్మకముంచి
పగటికలలో జీవించాము
నే టికి కలిగెను కనువిప్పు
ముంచుకు వచ్చెను పెనుముప్పు
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
చరణం : 2
వీరమాతలారా సుతులకు
చందన గంధం పూయండి
చందన గంధం పూయండి
వీరవనితలారా పతులకు
కుంకుమ తిలకం తీర్చండి
కుంకుమ తిలకం తీర్చండి
నెత్తురుపొంగే యువకుల్లారా కత్తులుదూసి దూకండి
బానిసతనమున బ్రతికేకన్న చావేమేలని తలచండి
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
చరణం : 3
మనమంతా ఒకజాతి సమైక్యమే మననీతి
మనమంతా ఒకజాతి సమైక్యమే మననీతి
కులమేదైనా మతమేదైనా వేషం భాష వేరే అయినా
జనమొకటే అని చాటండి
ధర్మదీక్షయే మన కవచం తప్పక మనదే ఘనవిజయం
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
చరణం : 4
భరతమాత పరువు నిల్పగా ఆ.....
భరత వీర ప్రతిన దాల్పరా ఆ.....
జయపతాక చేతబూనరా ఆ.....
సమర విజయశంఖమూదరా ఆ...
సమర విజయశంఖమూదరా ఆ...
చిత్రం : జైజవాన్ (1970)
రచన : శ్రీశ్రీ
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల, బృందం
No comments:
Post a Comment