చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
అనుపల్లవి :
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చరణం : 1
శ్వాస నీవే తెలుసుకోవే
స్వాతి చినుకై తరలి రావే
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమే
జాడ అయినా తెలియదేమే
ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీకోసం
ఎందుకమ్మా నీకీ మౌనం
తెలిసి కూడా ఇంకా దూరం
పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చరణం : 2
గుండెలోన వలపు గాయం
మంటరేపే పిదపకాలం
ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా
దూరమైన చెలిమి దీపం
భారమైన బతుకు శాపం
ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా
కలవు కావా నా కన్నుల్లో
నిమిషమైనా నీ కౌగిలిలో
సేద తీరాలి చేరవా నేస్తమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
చిత్రం : ఘర్షణ (2004)
రచన : కులశేఖర్
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : కె.కె., బృందం
----
పాట- 2
సాకీ :
కిసీ ఆషిక్ కా ఖయాల్ హై
తేరీ ఆఁఖీ లెహరా బిఛాల్ హై
ఏక్ ప్యార్ సా సవాల్ హై
ఏ తో బస్తీ కమాల్ హై...
భీగీ భీగీ సీ ఏ రాత్ హై
ఏ తో ప్యార్ కా ఏ రంగ్ హై
భీగీ భీగీ సీ ఏ రాత్ హై
ఏ తో ప్యార్ కా ఏ రంగ్ హై
ఏ రంగ్ హై తరంగ్ హై... ఏ రంగ్ హై తరంగ్ హై...
ఏ రంగ్ హై తరంగ్ హై...
పల్లవి :
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువు అచ్చుల్లోన హల్లువో... జడ కుచ్చుల్లోన మల్లెవో
నువు అచ్చుల్లోన హల్లువో... జడ కుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ రంగ్ హై తరంగ్ హై... ఏ రంగ్ హై తరంగ్ హై...
ఏ రంగ్ హై తరంగ్ హై...
భీగీ భీగీ సీ ఏ రాత్ హై
ఏ తో ప్యార్ కా ఏ రంగ్ హై
భీగీ భీగీ సీ ఏ రాత్ హై
ఏ తో ప్యార్ కా ఏ రంగ్ హై
చరణం : 1
ఈ పరిమళమూ నీదేనా
నాలో పరవశమూ నిజమేనా
బొండుమల్లి పువ్వుకన్న తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్న లాగు మరి నీవైపు
సొగసులు చూసి పాడగా ఎలా
కనులకు మాట రాదుగా హలా
వింతల్లోను కొత్తవింత నువ్వేనా
ఆ అందం అంటే అచ్చంగానూ నువ్వే
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
చరణం : 2
ఆ పలుకులలో పరవళ్ళు
తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి ఒంగుతుంది ఆశపడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతోంది మోజుపడి నీకోసం
స్వరముల తీపి కోయిలా ఇలా
పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువు అచ్చుల్లోన హల్లువో... జడ కుచ్చుల్లోన మల్లెవో
నువు అచ్చుల్లోన హల్లువో... జడ కుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
పూల జల్లువో... పూల జల్లువో...
చిత్రం : ఘర్షణ (2004)
రచన : కులశేఖర్
సంగీతం : హారిస్జయరాజ్
గానం : శ్రీనివాస్, బృందం
----
పాట- 3
సాకీ :
చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వాన వాన చినుకులే...
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువుకు పరుగులే
పల్లవి :
నన్నే నన్నే చూస్తూ... నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో... ఏదో... ఏదో... ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ... నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో... అమ్మో... ప్రాణం తియ్యొద్దే
చికుబం చికుబం భం చికుబో...
అనుపల్లవి :
నీకో నిజమే చెప్పనా... నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి తిల్లానా
నాలో ఏదో అల్లరి... అది నిన్నా మొన్నా లేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా...
ఓహుహహా... ఓహుహహా ఏమిటంటారు
ఈ మాయల్ని... ఓహుహహా... ఓహుహహా
ఎవరినడగాలో ప్రేమేనా అని
నన్నే నన్నే చూస్తూ... నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో... ఏదో... ఏదో... ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ... నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో... అమ్మో... ప్రాణం తియ్యొద్దే
చరణం : 1
ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల పెదాల వీణా
బిడియుములెరగని గడసరి సొగసుకు
తమకములెగసెను నరాలలోనా హలోనా
ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో
నా వాటం మొత్తం ఎంతో మారిందీ
ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ
ఓహుహో... ఓహో... హో...
నన్నే నన్నే మార్చి నీ మాటలతో ఏ మార్చి
ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్
కన్ను కన్ను చేర్చి నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయ్
చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వాన వాన చినుకులే...
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువుకు పరుగులే
చరణం : 2
మనసున అలజడి వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకి మైనా
కలలను నిజముగ ఎదురుగ నిలిపిన
వరముగ దొరికిన వయ్యారి జాణా ఆ జాణా
ఈలోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టిందీ
నీవల్లే ఇంతగా మారాలే వింతగా
నువ్వంటే నాకు పిచ్చే పట్టిందీ
లాలల్లా... లాలల్లా...
నన్నే నన్నే చూస్తూ... నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో... ఏదో... ఏదో... ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ... నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో... అమ్మో... ప్రాణం తియ్యొద్దే
నీకో నిజమే చెప్పనా... నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి తిల్లానా
నాలో ఏదో అల్లరి... అది నిన్నా మొన్నా లేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా...
ఓహుహహా... ఓహుహహా ఏమిటంటారు
ఈ మాయల్ని... ఓహుహహా... ఓహుహహా
ఎవరినడగాలో ప్రేమేనా అని...
ప్రేమేనా అని... ప్రేమేనా అని...
ప్రేమేనా అని... ప్రేమేనా అని...
చిత్రం : ఘర్షణ (2004)
రచన : కులశేఖర్
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : టిప్పు, షాలినీ సింగ్
No comments:
Post a Comment