Wednesday, March 16, 2011

Devadas (1974) - 2

పాట - 1
పల్లవి :

మేఘాల మీద సాగాలి

అనురాగాలరాశిని చూడాలి

నే పదం పాడుతూ ఉరకాలి

నువు కదం తొక్కుతూ ఎగరాలి

అహహా...అహా... ఓహోహో... హోహో...

చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్

చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్

చరణం : 1

చిన్ననాటి ఆ చిలిపితనం కన్నెవయసులో పెరిగిందా

వన్నెల చిన్నెల పడుచుదనం వాడిగా పదును తేరిందా

చిన్ననాటి ఆ చిలిపితనం కన్నెవయసులో పెరిగిందా

వన్నెల చిన్నెల పడుచుదనం వాడిగా పదును తేరిందా

తెలుసుకోవాలి కలుసుకోవాలి పారును నా పారును

మేఘాల మీద సాగాలి

అనురాగాల రాశిని చూడాలి

నే పదం పాడుతూ ఉరకాలి

నువు కదం తొక్కుతూ ఎగరాలి

అహహా... అహా... ఓహోహో... హోహో...

చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్

చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్

చరణం : 2

ఆమెకు ఎంతో అభిమానం అయినా నేనే ప్రాణం

నా మొండితనంలో తీయదనం ఆ చెవులకు మురళీగానం

ఆమెకు ఎంతో అభిమానం అయినా నేనే ప్రాణం

నా మొండితనంలో తీయదనం ఆ చెవులకు మురళీగానం

ఏడిపించాలి కలసి న వ్వాలి పారుతో నా పారుతో

మేఘాల మీద సాగాలి

అనురాగాల రాశిని చూడాలి

నే పదం పాడుతూ ఉరకాలి

నువు కదం తొక్కుతూ ఎగరాలి

అహహా... అహా... ఓహోహో... హోహో...

చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్

చల్‌రే బేటా చల్ చల్ చల్‌రే బేటా చల్


చిత్రం : దేవదాసు (1974)

రచన : ఆరుద్ర

సంగీతం : రమేష్‌నాయుడు

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 2

పల్లవి :

జీవితం ఏమిటీ వెలుతురు చీకటి... అంతే...

జీవితం ఏమిటీ వెలుతురు చీకటి

వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది అవును

జీవితం ఏమిటీ వెలుతురు చీకటి

చరణం : 1

మనసు విరిగి తునకలైతే

తునక తునకలో నరకమున్నది

మనసు విరిగి తునకలైతే

తునక తునకలో నరకమున్నది

లేదు లేదనుకున్న శాంతి

చేదులోనే ఉన్నది ఈ చేదులోనే ఉన్నది

జీవితం ఏమిటీ వెలుతురు చీకటి

చరణం : 2

రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే

రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే

మూగహృదయం గాయమైనది

ఆ గాయమే ఒక గేయమైనది... ఆ గాయమే ఒక గేయమైనది...

జీవితం ఏమిటీ వెలుతురు చీకటి

వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది

జీవితం ఏమిటీ వెలుతురు చీకటి

వెలుతురు చీకటి... వెలుతురు చీకటి...


చిత్రం : దేవదాసు (1974)

రచన : ఆరుద్ర

సంగీతం : రమేష్‌నాయుడు

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment