Wednesday, March 16, 2011

Donga ramudu (1955) - 5

పాట - 1
పల్లవి :

ఓ... ఓ... చిగురాకులలో చిలకమ్మా

చిన్నమాట వినరావమ్మా

ఓ... ఓ...మరుమల్లెలలో మావయ్యా

మంచి మాట సెలవీవయ్య

చరణం : 1

పున్నమి వెన్నెల గిలిగింతలకు

పూచిన మల్లెల మురిపాలు

నీ చిరునవ్వుకు సరికావమ్మ... ఓ...

ఓ... ఓ... చిగురాకులలో చిలకమ్మా

ఎవరన్నారు ఈ మాట

వింటున్నాను నీ నోట

తెలిసీ పలికిన విలువేనా... ఆ...

ఓ... ఓ... మరుమల్లెలలో మావయ్యా

చరణం : 2

వలచే కోమలివయ్యారాలకు

తలచే మనసుల తియ్యదనాలకు

కలవా విలువలు సెలవీయ... ఓ...

ఓ... ఓ... చిగురాకులలో చిలకమ్మా

చరణం : 3

పై మెరుగులకే భ్రమపడకయ్య

మనసే మాయని సొగసయ్య

గుణమే తరుగని ధనమయ్యా

ఓ... ఓ... మరుమల్లెలలో మావయ్యా

మంచి మాట సెలవీవయ్య

ఓ... ఓ... చిగురాకులలో చిలకమ్మా

చిన్న మాట వినరావమ్మా


చిత్రం : దొంగరాముడు (1955)

రచన : సముద్రాల సీనియర్

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : ఘంటసాల, జిక్కి

----

పాట - 2

పల్లవి :

భలే తాత మన బాపూజీ... బాలల తాత బాపూజీ

భలే తాత మన బాపూజీ... బాలల తాత బాపూజీ

బోసి నవ్వుల బాపూజీ... చిన్ని పిలక బాపూజీ

భలే తాత మన బాపూజీ... బాలల తాత బాపూజీ

చరణం : 1

కులమత భేదం వలదన్నాడు కలిసి బతికితే బలమన్నాడు

మానవులంతా ఒకటన్నాడు మనలో జీవం పోశాడు

భలే తాత మన బాపూజీ... బాలల తాత బాపూజీ

చరణం : 2

నడుం బిగించి లేచాడు అడుగు ముందుకు వేశాడు

కదంతొక్కుతూ పదం పాడుతూ దేశం దేశం కదిలింది

గజగజలాడెను సామ్రాజ్యం...

మనకు లభించెను స్వరాజ్యం... మనకు లభించెను స్వరాజ్యం...

భలే తాత మన బాపూజీ... బాలల తాత బాపూజీ

చరణం : 3

సత్యాహింసలే శాంతిమార్గమని జగతికి జ్యోతిని చూపించాడు

మానవ ధర్మం బోధించాడు... ఆ...

మానవ ధర్మం బోధించాడు మహాత్ముడై ఇల వెలిశాడు

భలే తాత మన బాపూజీ... బాలల తాత బాపూజీ

భలే తాత మన బాపూజీ... బాలల తాత బాపూజీ

భలే తాత మన బాపూజీ... బాలల తాత బాపూజీ

భలే తాత మన బాపూజీ... బాలల తాత బాపూజీ


చిత్రం : దొంగరాముడు (1955)

రచన : సముద్రాల సీనియర్

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : పి.సుశీల

----

పాట - 3

పల్లవి :

ఆ... ఆ ఆ ఆ... ఆ.....

అనురాగము విరిసేనా ఓ రేరాజా... అనుతాపము తీరేనా

వినువీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా

అనురాగము విరిసేనా ఓ రేరాజా... అనుతాపము తీరేనా

చరణం : 1

నిలిచేవు మొయిలు మాటున పిలిచేవు కనుల గీటున

నిలిచేవు మొయిలు మాటున పిలిచేవు కనుల గీటున

పులకించు నాదు డెందము ఏనాటి ప్రేమబంధమో ఓ... రేరాజా

అనురాగము విరిసేనా...

చరణం : 2

మునుసాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో

మునుసాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో

నీ మనసేమో తేటగా తెనిగించవయా మహరాజా... ఓ... రేరాజా

అనురాగము విరిసేనా ఓ రేరాజా... అనుతాపము తీరేనా

వినువీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా

అనురాగము విరిసేనా...


చిత్రం : దొంగరాముడు (1955)

రచన : సముద్రాల సీనియర్

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : పి.సుశీల

----

పాట - 4

పల్లవి :

రారోయి మా ఇంటికి... ఊఁ..

రారోయి మా ఇంటికి మావో మాటున్నది మంచి మాటున్నది

మాటున్నది మంచి మాటున్నది

చరణం : 1

నువు నిలుసుంటె నిమ్మచెట్టు నీడున్నది

నువు కూసుంటె కూర్చీలో పీటున్నది

నువు తొంగుంటె పట్టుమంచం పరుపున్నది

మాటున్నది మంచి మాటున్నది

రారోయి మా ఇంటికి మావో మాటున్నది మంచి మాటున్నది

చరణం : 2

ఆకలైతే సన్నబియ్యం కూడున్నది

నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది

అందులోకి అరకోడి కూరున్నది

అందులోకి అరకోడి కూరున్నది

ఆపైన రొయ్యపొట్టు చారున్నది

మాటున్నది మంచి మాటున్నది

రారోయి మా ఇంటికి మావో మాటున్నది మంచి మాటున్నది

చరణం : 3

రంజైన మీగడ పెరుగున్నది

నంజుకోను ఆవకాయ ముక్కున్నది

నీకు రోగమొస్తే ఘాటైన మందున్నది

రోగమొస్తే ఘాటైన మందున్నది

నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది


చిత్రం : దొంగరాముడు (1955)

రచన : సుముద్రాల సీనియర్

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : జిక్కి, బృందం

----

పాట - 5

పల్లవి :

అంద చందాల సొగసరివాడు

అంద చందాల సొగసరివాడు

విందు భోంచేయి వస్తాడు నేడు

చందమామ... ఓహో చందమామ

చందమామ ఓహో చందమామ ఓఓఓ...

చరణం : 1

ఓ... ఓ... ఓ... చూడచూడంగ మనసగువాడు

ఈడు జోడైన వలపుల రేడు

ఊఁ... వాడు నీకన్నా సోకైన వాడు

విందు భోంచేయి వస్తాడు నేడు

చందమామ... ఓహో చందమామ

చందమామ ఓహో చందమామ ఓఓఓ...

చరణం : 2

ఓ... ఓ... ఓ... వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు

వాని నవ్వుల్లో ముత్యాలు రాలు

ఊఁ... వాడు నీకన్నా చల్లని వాడు

విందు భోంచేయి వస్తాడు నేడు

చందమామ... ఓహో చందమామ

చందమామ ఓహో చందమామ ఓఓఓ...

చరణం : 3

ఓ... ఓ... ఓ.. నేటి పోటీల గడుసరివాడు

మాట పాటించు మగసిరివాడు

ఊఁ... వాడు నీకన్నా సిరిగిలవాడు

విందు భోంచేయి వస్తాడు నేడు

చందమామ... ఓహో చందమామ

చందమామ ఓహో చందమామ

అంద చందాల సొగసరివాడు

విందు భోంచేయి వస్తాడు నేడు

చందమామ... ఓహో చందమామ

చందమామ ఓహో చందమామ


చిత్రం : దొంగరాముడు (1955)

రచన : సముద్రాల సీనియర్

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : జిక్కి

No comments:

Post a Comment