అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెళ్లీ లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు ఏక్ నిరంజన్
ఊరే లేదు నాకూ పేరే లేదు
నీడా లేదు నాకే తోడూ లేదు
నేనెవరికి గుర్తే రాను ఎక్కిళ్ళే రావసలే
నాకంటూ ఎవరూ లేరే కన్నీళ్ళే లేవులే
పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఎహెయ్ ఒంటరివాణ్ణే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెళ్లీ లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు ఏక్ నిరంజన్
చరణం : 1
కేరాఫ్ ప్లాట్‌ఫాం సన్నాఫ్ బ్యాడ్ టైం అవారా డాట్ కాం
హే దమ్మరదం టన్స్ ఆఫ్ ఫ్రీడమ్ మనకదేగా ప్రాబ్లమ్
అరె డేటాఫ్ బర్తే తెలియదే నే గాలికి పెరిగాలే
హే జాలీ జోలా ఎరగనే నా గోలేదో నాదే
తిన్నావా దమ్మేసావా అని అడిగేదెవ్వడులే
ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లే డే
పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఎహెయ్ ఒంటరివాణ్ణే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్
తట్టా లేదు బుట్టా లేదు బుట్ట కింద గుడ్డు పెట్టే పెట్టా లేదు ఏక్ నిరంజన్
చరణం : 2
దిల్లిష్ బాడీ పుల్లాఫ్ నో వన్ ఈజ్ కేరింగ్
దట్స్ ఓకే యార్ చల్తా హై నేనే నా డార్లింగ్
ఏ కాకా చాయే అమ్మలా నను లేరా అంటుందీ
ఓ గుక్కెడు రమ్మే కమ్మగా నను పడుకోబెడుతుందీ ఎహెయ్...
రోజంతా నాతో నేనే కల్లోనూ నేనేలే
తెల్లారితే మళ్ళీ నేనే తేడాలే నే లే దే
పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఎహెయ్ ఒంటరివాణ్ణే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్
కిస్సూ లేదు మిస్సూ లేదు కస్సు బుస్సులాడే లస్కూ లేదు ఏక్ నిరంజన్
చిత్రం : ఏక్ నిరంజన్ (2009)
రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : మణిశర్మ
గానం : రంజిత్, బృందం
----
పాట - 2
పల్లవి :
ఎవరూ లేరని అనకు... తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ
ఎపుడూ ఒంటరి అనకు... నీతోనే చావు బ్రతుకు
కంటికి రెప్పై ఉంటాలే తుది వరకు
ప్రేమతోటి చెంప నిమరనా గుండె చాటు బాధ చెరపనా
నీ ఊపిరే అవ్వనా...
గడిచిన కాలమేదో గాయపరిచినా జ్ఞాపకాల చేదు మిగిలినా
మైమరిపించే హాయవ్వనా...
ఒట్టేసి నేను చెబుతున్నా వదిలుండలేను క్షణమైనా
నీ సంతోషానికి హామీ ఇస్తున్నా
ఎవరూ లేరని అనకు... తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ
చరణం : 1
నా మనసే నీకివ్వనా నీలోనే సగమవ్వనా
అరచేతులు కలిపే చెలిమే నేనవనా
ముద్దుల్లో ముంచేయనా కౌగిలిలో దాచెయ్యనా
నా కన్నా ఇష్టం నువ్వే అంటున్నా
దరికొస్తే తల తుడిచే చీరంచుగ నేనే మారనా
అలిసొస్తే ఎపుడైనా నా ఒడినే ఊయల చేస్తానంటున్నా
ఎవరూ లేరని అనకు... తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ
చరణం : 2
నిను పిలిచే పిలుపవ్వనా నిను వెతికే చూపవ్వనా
నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవనా
నిను తలచే తలపవ్వనా నీ కథలో మలుపవ్వనా
ఏడడుగుల బంధం నీతో అనుకోనా
మనసంతా దిగులైతే నిను ఎత్తుకు సముదాయించనా
నీకోసం తపనపడే నీ అమ్మా నాన్నా అన్నీ నేనవనా
ఎవరూ లేరని అనకు... తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ
చిత్రం : ఏక్ నిరంజన్ (2009)
రచన : భాస్కరభట్ల
సంగీతం : మణిశర్మ
గానం : మాళవిక
No comments:
Post a Comment