ఓహో... ఓ... ఓ... ఆ.....
హైలో హైలేసా హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినది ఊగీస లాడినది
హైలో హైలేసా హంస కదా నా పడవ
హో... హై... హో... హై..
చరణం : 1
ఓ... ఓ... నదిలో నా రూపు...
నదిలో నా రూపు నవనవలాడినది
మెరిసే అందములు మిలమిలలాడినవి
మెరిసే అందములు మిలమిలలాడినవి
వయుసూ వయ్యారము పాడినవి పదే పదే
వయసూ వయ్యారము పాడినవి పదే పదే
హైలో హైలేసా హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినది ఊగీస లాడినది
హైలో హైలేసా హంస కదా నా పడవ
చరణం : 2
ఓ... ఓ... ఎవరో మారాజు...
ఎవరో మారాజు ఎదుట నిలిచాడు
ఏవో చూపులతో సరసకు చేరాడు
ఏవో చూపులతో సరసకు చేరాడు
మనసే చలించునే మాయదారి మగాళ్ళకి
మనసే చలించునే మాయదారి మగాళ్ళకి
హైలో హైలేసా హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినది ఊగీస లాడినది
హైలో హైలేసా హంస కదా నా పడవ
హో... హై... హో... హై..
చిత్రం : భీష్మ (1962)
రచన : ఆరుద్ర
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : జమునారాణి
No comments:
Post a Comment