Wednesday, March 16, 2011

Doctor chakravarthy (1964) - 4

పాట - 1

పల్లవి :

పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా

నేనే పరవశించి పాడనా

పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా

చరణం : 1

నీవు పెంచిన హృదయమే

ఇది నీవు నేర్పిన గానమే... ఆ...

నీవు పెంచిన హృదయమే

ఇది నీవు నేర్పిన గానమే... ఆ...

నీకుగాక ఎవరికొరకు

నీవు వింటే చాలు నాకు

పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా

చరణం : 2

చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పువ్వులై...

చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పువ్వులై...

ఆ పూవులన్నీ మాటలై వినిపించు నీకు పాటలై...

పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా

నేనే పరవశించి పాడనా

చరణం : 3

ఈ వీణ మ్రోగ క ఆగినా

నే పాడజాలకపోయినా... ఆ...

ఈ వీణ మ్రోగ క ఆగినా

నే పాడజాలకపోయినా... ఆ...

నీ మనసులో ఈనాడు నిండిన

రాగమటులే ఉండనీ అనురాగమటులే ఉండనీ

పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా... నేనే...


చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

మనసున మనసై బ్రతుకున బ్రతుకై

మనసున మనసై బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము

మనసున మనసై బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము

చరణం : 1

ఆశలు తీరని ఆవేశములో...

ఆశయాలలో... ఆవేదనలో...

చీకటి మూసిన ఏకాంతములో

తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము

చరణం : 2

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు...

నీ కోసమే కన్నీరు నింపుటకు

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు...

నీ కోసమే కన్నీరు నింపుటకు

నేనున్నానని నిండుగ పలికే

తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము

చరణం : 3

చెలిమియె కరువై వలపే అరుదై

చెదరిన హృదయమే శిలయై పోగా

నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే

తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము

మనసున మనసై బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము


చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)

రచన : శ్రీ శ్రీ

సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

గానం : ఘంటసాల

----

పాట - 3

పల్లవి :

ఎవరో జ్వాలను రగిలించారు

వేరెవరో దానికి బలియైనారు

వేరెవరో దానికి బలియైనారు

ఎవరో జ్వాలను రగిలించారు

వేరెవరో దానికి బలియైనారు

చరణం : 1

అడుగు అడుగున అపజయములతో

అలసి సొలసిన నా హృదయానికి

సుధవై... సుధవై జీవన సుధవై

ఉపశాంతి నివ్వగా ఓర్వనివారలు

ఎవరో జ్వాలను రగిలించారు

వేరెవరో దానికి బలియైనారు

చరణం : 2

అనురాగానికి ప్రతిరూపాలై

ఆది దంపతులవలె మీరుంటే

అనురాగానికి ప్రతిరూపాలై

ఆది దంపతులవలె మీరుంటే

ఆనందంతో మురిసానే... ఆత్మీయులుగా తలచానే

అందుకు ఫలితం అపనిందేనా

ఎవరో జ్వాలను రగిలించారు

వేరెవరో దానికి బలియైనారు

చరణం : 3

మనిషికి మనిషికి మమత కూడదా...

మనసు తెలుసుకొను మనసే లేదా

ఇది తీరని శాపం... ఇది మారని లోకం

మానవుడే దానవుడై మసలే చీకటి నరకం

ఎవరో జ్వాలను రగిలించారు

వేరెవరో దానికి బలియైనారు

వేరెవరో దానికి బలియైనారు


చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : ఘంటసాల

----

పాట - 4

పల్లవి:

నీవు లేక వీణ పలుకలేనన్నది

నీవు రాక రాధ నిలువ లేనన్నది... ఆ...

నీవు లేక వీణ...

చరణం:1

జాజి పూలు నీకై రోజు రోజు పూచే

చూసి చూసి పాపం సొమ్మసిల్లి పోయే

చందమామ నీకై తొంగి తొంగి చూచి

చందమామ నీకై తొంగి తొంగి చూచి

సరసను లేవని అలుకలు బోయే

నీవు లేక వీణ...

చరణం: 2

కలలనైన నిన్ను కనుల చూతమన్నా

నిదుర రాని నాకు కలలు కూడ రావే

కదల లేని కాలం విరహ గీతి రీతి

కదల లేని కాలం విరహ గీతి రీతి

పరువము వృథగా బరువుగ సాగే

నీవు లేక వీణ...

చరణం: 3

తలుపులన్ని నీకై తెరచి వుంచినాను

తలపులెన్నో మదిలో దాచి వేచినాను

తాపమింక నేను ఓపలేను స్వామి

తాపమింక నేను ఓపలేను స్వామి

తరుణిని కరుణను ఏలగ రావా

నీవు లేక వీణ పలుకలేనన్నది

నీవు రాక రాధ నిలువ లేనన్నది... ఆ...

నీవు లేక వీణ...


చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : పి.సుశీల

No comments:

Post a Comment