దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో
చరణం : 1
పాలిత కింకర భవ నాశంకర శంకర పురహర నమో నమో
పాలిత కింకర భవ నాశంకర శంకర పురహర నమో నమో
హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో
చరణం : 2
దురిత విమోచన ఆ... ఆ... ఆ...
దురిత విమోచన ఫాల విలోచన పరమ దయాకర నమో నమో
కరి చర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరి చర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో
నమో నమో నమో నమో... నమో నమో నమో నమో...
నమో నమో నమో నమో... నమో నమో నమో నమో...
నారాయణ హరి నమో నమో... నారాయణ హరి నమో నమో...
నారాయణ హరి నమో నమో... నారాయణ హరి నమో నమో...
నారద హృదయ విహారీ నమో నమో...నారద హృదయ విహారీ నమో నమో...
నారాయణ హరి నమో నమో... నారాయణ హరి నమో నమో...
పంకజ నయన పన్నగ శయన... పంకజ నయన పన్నగ శయన...
పంకజ నయన పన్నగ శయన...
శంకర వినుత నమో నమో... శంకర వినుత నమో నమో...
నారాయణ హరి నమో నమో... నారాయణ హరి నమో నమో...
నారాయణ హరి నమో నమో...
చిత్రం : భూకైలాస్ (1958)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : సుదర్శనం-గోవర్థనం
గానం : ఘంటసాల
----
పాట - 2
సాకీ :
జయ జయ మహాదేవ శంభో సదాశివా..
అశ్రీతమందారా శృతిశిఖర సంచారా..
పల్లవి :
నీలకంథరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా
నీలకంథరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ
నీలకంథరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా
చరణం : 1
అన్యదైవముగొలువా...
అన్యదైవముగొలువా నీదుపాదము విడువా
అన్యదైవముగొలువా నీదుపాదము విడువా
దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా
దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా
నీలకంథరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా
చరణం : 2
దేహియన వరములిడు దానగుణసీమా
పాహియన్నను ముక్తినిడు పరంధామా
నీమమున నీ దివ్యనామ సంస్మరణా
ఏమరక చేయుదును భవతాపహరణా
నీ దయామయ దృష్టి దురితముమలార
వరసుధావృష్టి నా వాంఛలీడేరా
కరుణించు పరమేశ దరహాసభాసా
హరహర మహాదేవ కైలాసావాసా... కైలాసావాసా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
కన్నులవిందుగ భక్తవత్సల కావగ రావయ్యా
కన్నులవిందుగ భక్తవత్సల కావగ రావయ్యా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ప్రేవుమీర నీదు భక్తుని వూటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని మానవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
చిత్రం : భూకైలాస్ (1958)
రచన : సముద్రాల సీనియుర్
సంగీతం : సుదర్శనం, గోవర్థనం
గానం : ఘంటసాల
----
పాట - 3
పల్లవి :
మున్నీట పవళించు నాగశయన
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలు చేయ
మున్నీట పవళించు నాగశయన
నీ నాభి కమలాన కొలువు జేసే
నీ నాభి కమలాన కొలువు జేసే
వాణీశు భుజపీఠి బరువు వేసి
వాణీశు భుజపీఠి బరువు వేసి
పాల... మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలు చేయ
చరణం : 1
మీనాకృతి దాల్చినావు వేదాల రక్షింప మీనాకృతి దాల్చినావు
కూర్మాకృతి బూనినావు వారధి మథియింప కూర్మాకృతి బూనినావు
కిటి రూపము దాల్చినావు కనకాక్షు వధియింప కిటి రూపము దాల్చినావు
నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప నరసింహమై వెలసినా...
నరసింహమై వెలసినావు
నతపాల మమునేల జాగేల
నతపాల మమునేల జాగేల
పాల...మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలు చేయ
చరణం : 2
మోహినీ విలాస కలిత నవమోహన
మోహదూర మౌనిరాజ మనోమోహన
మోహినీ విలాస కలిత నవమోహన
మోహదూర మౌనిరాజ మనోమోహన
మందహాస మధుర వదన రమానాయకా
మందహాస మధుర వదన రమానాయకా
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల
పాల... మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలు చేయ
చిత్రం : భూకైలాస్ (1958)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఆర్.సుదర్శనం-గోవర్థనం
గానం : ఎం.ఎల్.వసంతకుమారి
No comments:
Post a Comment