Tuesday, March 15, 2011

Chelleli kapuram (1971) - 1

పాట - 1
సాకీ :

చరణకింకిణులు ఘల్లుఘల్లుమన

కరకంకణములు గలగలలాడగ

వినీలకచభరవిలాసబంధుర

తనూలతిక చంచలించిపోగా

పల్లవి :

ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ

నీ కులుకును గని నా పలుకు విరియ

నీ నటనను గని నవ కవిత వెలయగా

ఆడవే మయూరీ

చరణం : 1

అది యమునా సుందరతీరము

అది రమణీయ బృందావనము

అది విరిసిన పున్నమి వెన్నెల

అది వీచిన తెమ్మెర ఊయల

అది చల్లని సైకతవేదిక

అట సాగెను విరహిణి రాధిక

అది రాధ మనసులో మాధవుడూదిన

రసమయ మురళీ గీతిక

ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ

నా పలుకుల కెనయగు కులుకు చూపి

నా కవితకు సరియగు నటన చూపి

ఇక... ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ

చరణం : 2

ఫాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవ శరుని ద హియించగా

పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా

హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా

ప్రమథనాథ కరపంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా

ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కుటుల

చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల

సహస్రఫణ సంజనితఫూత్కృతుల

కనులలోన కనుబొమలలోన

అధరమ్ములోన వదనమ్ములోన

గళసీమలోన కటిసీమలోన

కరయుగములోన పదయుగములోన

నీ తనువులోని అణువణువులోన

అనంత విధముల అభినయించి ఇక

ఆడవే ఆడవే ఆడవే...


చిత్రం : చెల్లెలి కాపురం (1971)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం: కె.వి.మహదేవన్

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment