Saturday, March 19, 2011

Goranthadeepam (1978) - 1

పాట - 1
పల్లవి :

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా

బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా

బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా

పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా

పాదుకైనా కాకపోతినిభక్తి రాజ్యమునేలగా

చరణం : 1

అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా

అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా

అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా

అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా

కడలి గ ట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా

కాలమెల్ల రామభ ద్రుని వేలిగురుతులు మోయనా

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా

బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా

చరణం : 2

కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు

గడ్డిపోచను శరముచేసే ఘనత రాముడు చూపగా

కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు

గడ్డిపోచను శరముచేసే ఘనత రాముడు చూపగా

మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా

మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా

మద మత్సరమ్ములు రేపగా

పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా

పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యమునేలగా

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా

బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా


చిత్రం : గోరంత దీపం (1978)

రచన : ఆరుద్ర

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పి.సుశీల

No comments:

Post a Comment