Tuesday, March 15, 2011

Chandamama (2007) - 2

పాట - 1
పల్లవి :

నాలో ఊహలకు నాలో ఊసులకుఅడుగులు నేర్పావూ

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ

పరుగులుగా... పరుగులుగా...

అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ!

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ

చరణం : 1

ఆ ఆ ఆ....

కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే

పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే

శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతుంది ఇలా!

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ

చరణం : 2

మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ

మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ

నిన్ను చూస్తూ... ఆవిరవుతూ... అంతమవ్వాలనే!

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ

పరుగులుగా... పరుగులుగా...

అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ!

నాలో ఊహలకు... నాలో ఊసులకు... అడుగులు నేర్పావూ....


చిత్రం : చందమామ (2007)

రచన : అనంత్ శ్రీరామ్

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : ఆశా భోస్లే, కె.ఎం.రాధాకృష్ణన్

----

పాట - 2

సాకీ :

పచ్చిపాలా యవ్వనాల గువ్వలాట..

పంచుకుంటే రాతిరంతా... జాతరంటా

పల్లవి :

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా

ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా

పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా

కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మా

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా

ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా

చరణం : 1

ఎదురే నిలిచే అధర మధుర దరహాసం

ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం

వెలిగే అందం చెలికే స్వంతం.. వసంతం

వరమై దొరికే అసలు సిసలు అపురూపం

కలిసే వరకూ కలలో జరిగే.. విహారం

పుష్యమాసాన మంచు నీవో...

భోగిమంటల్లో వేడి నీవో...

పూల గంధాల గాలి నీవో...

పాల నురగల్లో తీపి నీవో...

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా

నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులాట

సందెగాలి కొట్టగానె ఆరుబయట ఎన్నెలింట

సర్దుకున్న కన్నెజంట సద్దులాయరో

నారుమల్లి తోటకాడ నాయడోరి ఎంకిపాట

నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులాట

సందెగాలి కొట్టగానె ఆరుబయట ఎన్నెలింట

సర్దుకున్న కన్నెజంట సద్దులాయరో

చరణం : 2

ఎదలో జరిగే విరహ సెగల వనవాసం

బదులే అడిగే మొదటి వలపు అభిషేకం

వధువై బిడియం ఒదిగే సమయం... ఎపుడో...

జతగా పిలిచే అగరు పొగల సాహవాసం

జడతో జగడం జరిగే సరసం... ఎపుడో...

అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే...

అన్ని రంగుల్లో ఆమె రూపే...

అన్ని వేళల్లో ఆమె ధ్యాసే...

నన్ను మొత్తంగా మాయ చేసే...

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా

ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా

పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా

కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మా


చిత్రం : చందమామ (2007)

రచన : పెద్దాడ మూర్తి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : రాజేష్, బృందం

No comments:

Post a Comment