Friday, March 18, 2011

Gaayam-2 (2010) - 2

పాట - 1
పల్లవి :

ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా...

సంధ్యవేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా...

వెంట వెంటనే అన్నీ అందుకోగరా జంట వింతలే ఎన్నో చూసుకోగరా

ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా...

సంధ్య వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా...

చరణం : 1

నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ

నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ

నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ

నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ

చాటుమాటులో సరసం చాలదీ పని

గోటి రాతలే కవితై నీకు తోచనీ

తెలిపేందుకు వస్తున్నా తెలిసిందని కనుగొన్నా

కొరికేసే కల నువ్వై రారా... హహ్హా...

ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా...

సంధ్య వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా...

చరణం : 2

చిన్న చోటులోనె అందే పెద్ద హాయిని

ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని

చిన్న చోటులోనె అందే పెద్ద హాయిని

ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని

పొందకుంటే ఈ మాత్రం జన్మ ఎందుకో

ఆడకుంటే ఈ ఆత్రం ఇక్కడెందుకో

అడగాలని అనుకున్నా అటు నీ కసి కనుగొన్నా

ఇది నీదే ఇక ఏదేమైనా... హాహాహా...

ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా...

సంధ్య వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా...

వెంట వెంటనే అన్నీ అందుకోగరా జంట వింతలే ఎన్నో చూసుకోగరా

ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా...

సంధ్య వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా...


చిత్రం : గాయం-2 (2010)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం : ఇళయరాజా

గానం : శ్రీరామ్ పార్థసారథి, గీతా మాధురి

----

పల్లవి :

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా

కలసిన గుండెల్లో కలతలే కన్నారా

నిన్న మొన్న నీడల్లేనీతో ఉన్న సందెల్లే

ఈ వెతలుగ చెలరేగేనా

నాతో సాగే స్నేహం... నాలో రేపే శోకం

శాపంలాంటి దూరం... చూపించేనా తీరం

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా

చరణం : 1

ఏనాటిదో అనురాగం ఈనాడిలా పెనవేసే

పాదం సాగే ప్రతిచోట పాశం తానే అడుగేసే

మనసే మురిసే మలుపులలోన

వెతలే రగిలే ఎద లయలోన

మదిని వీడని మమతిదియని

మరి మరి ముడిపడగా

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా

చరణం : 2

గాయం మాన్పే చెలిమేదో కాలం ఇలా కలిపేనా

గమ్యం చేరే తరుణాన గాలి వాన ఉరిమేనా

ఒడిని వెతికే సమయములోన

ధరణి కనని మది కుమిలేనా

వలచిన కథ వరము అవ్వనీ

చెరగని గురుతులుగా

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా

కలసిన గుండెల్లో కలతలే కన్నారా

నిన్న మొన్న నీడల్లే నీతో ఉన్న సందెల్లే

ఈ వెతలుగ చెలరేగేనా

నాతో సాగే స్నేహం... నాలో రేపే శోకం

శాపంలాంటి దూరం... చూపించేనా తీరం

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా


చిత్రం : గాయం-2 (2010)

రచన : వనమాలి

సంగీతం, గానం : ఇళయరాజా

No comments:

Post a Comment