Wednesday, March 16, 2011

Donga police (1992) - 1

పాట - 1
పల్లవి :

ఆ పూలరంగు నీ చీర చెంగు

రాశాయి నాలో గీతాలు ఏవో

నే పాడుకుంటానులే రాగాల లోగిళ్లలో

అనురాగాల వాకిళ్లలో

ఓ తేనె దొంగ నా సామిరంగ

పుట్టాను నీకై పూసాను పూవై

నీ వెంట ఉంటానులే నీ దాననౌతానులే

మరి నీలోని గీతాన్నిలే

సరి సరి గరిగపద...సరి సరి గరిగపద...

చరణం : 1

పుసుపుగ విరిసిన పూవులు

తలపై కురిసెను పలికెను

ఉండాల నీ పచ్చగా... హోయ్

తెల్లగ విరిసిన పూవులు

ఎదపై కురిసెను పలికెను

ఉండాల నీ ప్రేమతో...

ఆ రంగుతోటి ఈ రంగు కలిసే నీ కాళ్ల పారాణిగా

నా కళ్లలో రాణిగా... నా కళ్లలో రాణిగా...

ఓ తేనె దొంగ నా సామిరంగ

పుట్టాను నీకై పూసాను పూవై

నే పాడుకుంటానులే రాగాల లోగిళ్లలో

అనురాగాల వాకిళ్లలో

చరణం : 2

కలిసిన కనులకే తెలియును

వలపుల మలుపుల సొగసులు

ఏ ప్రేమబంధాలివో...

నడిచిన అడుగులే కలుపును

మనుసును మనసును ఒకటిగా

ఏ రాగబంధాలివో...

ఆ బంధమేదో అనుబంధమేదో

పాడాలి భూపాలమై...

అందానికే మూలమై అందానికే మూలమై

ఆ పూలరంగు నీ చీర చెంగు

రాశాయి నాలో గీతాలు ఏవో

నే పాడుకుంటానులే రాగాల లోగిళ్లలో

అనురాగాల వాకిళ్లలో...


చిత్రం : దొంగ పోలీస్ (1992)

రచన : రసరాజు

సంగీతం : బప్పీలహరి

గానం : జేసుదాస్, చిత్ర

No comments:

Post a Comment