ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు...
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు...
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు...
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు...
నా కన్నుల్లోన నీ రూపం
నా కన్నా ఎంతో అపురూపం
అనిపించే చిన్నారి... ఈ అనుభవమే నాకు తొలిసారి
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు...
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు...
చరణం : 1
నిన్ను చూస్తే నిన్న లేని చలనం నాలోన.. నాలోనా
కన్నుమూస్తే నిన్ను కలిసే కలలే ఓ లలనా
ఎందుకో నా గుండెలోన ఏదో హైరానా.. హైరానా
ఎంతమంది ఎదుట ఉన్నా ఒంటరినౌతున్నా
ఈ అల్లరి నీదేనా నను అల్లిన థిల్లానా
అనుకున్నాన మరి నాలోనా
ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని
అందం... అందం...
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు...
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు...
అయిపోయాడు డ్రీమ్ బాయ్...అయిపోయాడు డ్రీమ్ బాయ్...
అయిపోయాడు డ్రీమ్ బాయ్...
చరణం : 2
మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా.. చూస్తున్నా
నేను మాత్రం నిన్ను చూస్తూ కలవరపడుతున్నా
ఊహలన్నీ వాస్తవాలై నీలా మారేనా.. మారేనా
ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా
ఆ దైవం ఎదురైనా ఈ భావం నిలిపేనా
అనుకున్నాన మరి నాలోనా
ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని
అందం... అందం...
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు...
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు...
నా కన్నుల్లోన నీ రూపం
నా కన్నా ఎంతో అపురూపం
అనిపించే చిన్నారి... ఈ అనుభవమే నాకు తొలిసారి
చిత్రం : డాన్ (2007)
రచన : చిన్ని చరణ్
సంగీతం : రాఘవ లారెన్స్
గానం : హరీష్ రాఘవేంద్ర
No comments:
Post a Comment