Friday, March 18, 2011

Ganesh (1998) - 1

పాట - 1
పల్లవి :

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు

చిరుచిరు ఆశలు ఈ గలగల ఊసులు

కలబోసి చేసినవి కిలకిల నవ్వులు

వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు

దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు

ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు

చిరుచిరు ఆశలు ఈ గలగల ఊసులు

చరణం :

అల్లరంత సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటే హోయ్

నిలువలేక నిశ్శబ్దమే విసుగుపుట్టి పోదా

సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని

కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మనకళ్ళనీ

ఈ మణికాంతి వెలుగుతుఉంటే

ఈ మణికాంతి వెలుగుతు ఉంటే

చీకటి రాదే కన్నులకెదురుగ

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు

చిరుచిరు ఆశలు ఈ గలగల ఊసులు

కలబోసి చేసినవి కిలకిల నవ్వులు

వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు

దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు

ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు

చిరుచిరు ఆశలు ఈ గలగల ఊసులు


చిత్రం : గణేష్ (1998)

రచన : సిరివెన్నెల

సంగీతం : మణిశర్మ

గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment