Tuesday, March 15, 2011

Chandramukhi (2005) - 4

పాట - 1

పల్లవి :

కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి

నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి

కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి

నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి

ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి

అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి

కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి

నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి

చరణం : 1

గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతకాలం

కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం

మదనుడికి పిలుపు మల్లె కాలం

మదిలోనె నిలుపు ఎల్లకాలం

చెలరేగు వలపు చెలి కాలం

కలనైన తెలుపు కలకాలం

తొలి గిలి కాలం కౌగిలికాలం మన కాలం ఇది... ఆ...

కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి

నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి

చరణం : 2

కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాము కాలం

గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమకాలం

తమి తీరకుండు తడి కాలం

క్షణమాగనంది ఒడి కాలం

కడిగింది సిగ్గు తొలికాలం

మరిగింది మనసు మలి కాలం

మరి సిరికాలం మగసొరి కాలం మన కాలం పదా... ఆ...

కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి

నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి

ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి

అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి


చిత్రం : చంద్రముఖి (2005)

రచన : వెన్నెలకంటి

సంగీతం : విద్యాసాగర్

గానం : సుజాత, యదు బాలకృష్ణ

----

పాట - 2

పల్లవి :

అరె అరె అరె అరె అరె...

దేవుడ దేవుడా తిరుమల దేవుడా

చూడర చూడరా కళ్లు విప్పి చూడరా

దేవుడ దేవుడా తిరుమల దేవుడా

చూడర చూడరా కళ్లు విప్పి చూడరా

నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు

నువు కొంచెం సానపెట్టరా...

రిపీటు...నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు

నువు కొంచెం సానపెట్టరా...

శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ...

స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...

దేవుడ దేవుడా తిరుమల దేవుడా

చూడర చూడరా కళ్లు విప్పి చూడరా

చరణం : 1

ఆరె ఆరే ఆరె ఆరే.. అరెరే ఆరే అరెరే ఆరే

ఆలోచించు కొంచెం రైతుబిడ్డ కష్టం

అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం

వాడలోని మలినం శుభ్రం చేసేవారు

నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు

మాసిన జుట్టు పనీ పట్టె వాడంటూ లేకుంటే

తగ్గుతుందా తల బరువూ

నీళ్లలోనే నిలిచి ఉతికే వాడంటూ లేకుంటే

నిలుచునా మన పరువూ

ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు

దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్..

రిపీటు... శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ...

స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...

ఆ... దే వుడ దేవుడా తిరుమల దేవుడా

చూడర చూడరా కళ్లు విప్పి చూడరా

చరణం : 2

నీ గురించి ఎవరో అరె ఏమనుకుంటే ఏమి

ఈ చెవితోటి విన్నాగాని ఆ చెవిలోంచి వదిలేయ్

మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా

ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి

పూలబంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా

తేలుతుందోయ్ పైకి సోదరా

అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా

తేలిరారా పూలబంతిలా

మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా

పున్నమినాటి జాబిలి చల్లే పండు వెన్నెలాపగలదా...

రిపీటు... శక్తులన్నీ వచ్చి చేరుకుంటే.... ఓ ఓ ఓ...

స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...

దే వుడ దేవుడా తిరుమల దేవుడా

చూడర చూడరా కళ్లు విప్పి చూడరా

నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు

నువు కొంచెం సానపెట్టరా...

రిపీటు... నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు

నువు కొంచెం సానపెట్టరా... శభాషు....

శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ...

స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...


చిత్రం : చంద్రముఖి (2005)

రచన : భువనచంద్ర

సంగీతం : విద్యాసాగర్

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 3

పల్లవి :

రారా... రారా సరసకు రారా

రారా చెంతకు చేర...

ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా...

శ్వాసలో శ్వాసవై రారా...

రారా సరసకు రారా

రారా చెంతకు చేర...

ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా...

శ్వాసలో శ్వాసవై రారా...

చరణం : 1

తోం తోం తోం... తోం తోం తోం

ఆ... దిరదిన దిరదిన దిరదిన ఆ...

నీ పొందు నే కోరి అభిసారికై నేనే వే చాను సుమనోహరా

కాలాన మరుగైన ఆనందరాగాలు వినిపించ నిలిచానురా

తనన ధీంతధీంత ధీంతన... తనన ధీంతధీంత ధీంతన

తనన ధీంతధీంత ధీంతన...

వయసు జ్వాల ఓపలేదురా మరులుగొన్న చిన్నదాన్నిరా

తనువు బాధ తీర్చ రావెరా రావెరా

సలసలసల రగిలిన పరువపు సొద ఇది

తడిపొడి తడిపొడి తపనల స్వరమిది రా రా... రా రా... రారా...

లకలకలకలకలకలకలకలక

చరణం : 2

ఏ బంధమో ఇది ఏ బంధమో

ఏ జన్మ బంధాల సుమగంధమో

ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో

నయనాల నడయాడు తొలి స్వప్నమో

విరహపు వ్యధలను వినవా

ఈ తడబడు తనువును కనవా

మగువల మనసులు తెలిసి

నీ వలపును మరచుట సులువా

ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక

సరసన నిలిచితి విరసమె తగదిక

జిగిబిగిజిగిబిగి సొగసుల మొర విని

మిలమిల మగసిరి మెరుపులు మెరివగ

రా రా... రా రా... రారా...

లకలకలకలకలకలకలకలక

తాం తరికిట ధీం తరికిట తోం తరికిట నం తరికిట

తత్తత్తరికిట దిత్తిత్తరికిట తోం తోం తరికిట నంనంతరికిట

తాం ధీం తోం నం ఝమ్ ఝమ్... తాం ధీం తోం నం ఝమ్ ఝమ్

తకిట దికిట తోంకిట నంకిట... తకతరికిటతక

తత్తత్తళాంగుతోం... తత్తత్తళాంగుతోం... తత్తత్తళాంగుతోం...

తకధిత్తిత్తళాంగుతోం

తళాంగు తకఝం తధీం తనకుఝం... తళాంగు తకఝం తధీం తనకుఝం

తళాంగు తకఝం తధీం తనకుఝం...


చిత్రం : చంద్రముఖి (2005) (తమిళం)

రచన : భువనచంద్ర

సంగీతం : విద్యాసాగర్

గానం : బిన్ని కృష్ణకుమార్, టిప్పు

(గమనిక : ఇది తమిళ చిత్రంలో ఉన్న తెలుగు వెర్షన్ పాట)

----

పాట - 4

పల్లవి :

అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం

తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం

అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం

తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం

అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మా

ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మా

ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మా

ఈ పాట ఇచ్చింది కూడ ఈశుడే బొమ్మా

ముక్కంటి పాదాలు నేను ముద్దుపెట్టానే

ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే

అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం

తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం

చరణం : 1

వాగు వంక పొంగే వానాకాలంలోన వింటావమ్మా నది పాట ఓ నది పాట

మల్లే మొగ్గ బంతి బుగ్గ మీటి పాటే కట్టిదంమ్మా వని పాట ఓ వని పాట

ఏయ్... చిందులు వేయించే పాట

కనువిందులు కావించే పాట

గుండె సంధించే పాట

ఆ దివిని అందించే పాట

నా పాట సవ్వడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడూ

అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం

తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం

చరణం : 2

చిన్ని చిన్ని ఊయల కట్టి అమ్మ జోల లాలి లాలి తొలిరాగం ఓ తొలిరాగం

ఆలుమగలు గుట్టుగ చేరి ఏకాంతంలో పాడే రాగం అనురాగం ఓ అనురాగం

హే... లోకమంటే వింత అది తెలియకుంటే చింత

నువ్వు నేను అంతా ఆ దేవుని ముందు ఎంత

అరె అన్నీ తెలిసినవాడు ఎవడూ లేనేలేడమ్మా

అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం

తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం

అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మా

ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మా

ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మా

ఈ పాట ఇచ్చింది కూడ ఈశుడే బొమ్మా

ముక్కంటి పాదాలు నేను ముద్దుపెట్టానే

ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే

అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం

తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం


చిత్రం : చంద్రముఖి (2005)

రచన : సుద్దాల అశోక్‌తేజ

సంగీతం : విద్యాసాగర్

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment