Monday, March 14, 2011

Brahma (1992) - 1

పాట - 1

పల్లవి :

ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు

బ్రహ్మ ఒక్కడే... పరబ్రహ్మ ఒక్కడే...

ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

చరణం : 1

ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా

అపరంజి బొమ్మకోసం ఈనాడు పాడినా

అభిమానమున్న వాణ్ణి అవమాన పరచినా

ఎదలోని చీకటంతా వెన్నెలగ మార్చినా

బ్రహ్మ ఒక్కడే... పరబ్రహ్మ ఒక్కడే...

ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

చరణం : 2

అనురాగ జీవితాన పెనుగాలి రేగినా

తనవారు కానరాక కనుపాప ఏడ్చినా

కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు రాల్చినా

సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా

బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే

ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన

ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు

బ్రహ్మ ఒక్కడే...పరబ్రహ్మ ఒక్కడే...


చిత్రం : బ్రహ్మ (1992)

రచన : గురుచరణ్

సంగీతం : బప్పీలహరి

గానం : కె.జె.ఏసుదాస్

No comments:

Post a Comment