ప్రణయమా మరుమల్లె పూలతోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమానండూరి వారి గేయమా
ప్రణయమా మరుమల్లె పూలతోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా
ప్రణయమా మరుమల్లె పూలతోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
చరణం : 1
ఔననకా కాదనకా మనసే వినకా మురిపిస్తావేల ప్రాయమా
రేయనకా పగలనకా తపనల వెనకా తరిమేస్తావేల న్యాయమా
నిన్నలేని చోద్యమా నిన్ను ఆపసాధ్యమా
నిన్నలేని చోద్యమా నిన్ను ఆప సాధ్యమా
ఆ... ఆ... ఆ... ఆ...
గుండెచాటు గానమా గొంతుదాటు మౌనమా
ఎదలోని ఇంద్రజాలమా
ప్రణయమా మరుమల్లె పూలతోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
చరణం : 2
పూలనకా ముల్లనకా వలచిన క్షణమే విహరిస్తావేల హృదయమా
రేపనకా మాపనకా ఆ మరుక్షణమే విసిగిస్తావేల విరహమా
ఇంత వింత సత్యమా ఎంతకైన సిద్ధమా
అంతులేని ఆత్రమా అందులోనె అందమా
ఆ... ఆ... ఆ... ఆ...
కోటి కలల నేత్రమా
కొంటె వలపు గోత్రమా
శృంగార సుప్రభాతమా
ప్రణయమా మరుమల్లె పూలతోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా
ప్రణయమా మరుమల్లె పూలతోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
చిత్రం : బొంబాయి ప్రియుడు (1996)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కీరవాణి, చిత్ర
No comments:
Post a Comment