Tuesday, March 15, 2011

Chaduvukunna ammayilu (1963) - 2

పాట - 1

పల్లవి :

వినిపించని రాగాలే కనిపించని అందాలే

అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే

వినిపించని రాగాలే...

చరణం : 1

తొలిచూపులు నాలోనే వెలిగించెదీపాలే

తొలిచూపులు నాలోనే వెలిగించె దీపాలే

చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే

వలచే మనసే మనసు...

వినిపించని రాగాలే...

చరణం : 2

వలపే వసంతములా పులకించి పూచినది

వలపే వసంతములా పులకించి పూచినది

చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి

విరిసే వయసే వయసు...

వినిపించని రాగాలే...

చరణం : 3

వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే

వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే

విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే

ఎదలో ఎవరో మెరిసే...

వినిపించని రాగాలే కనిపించని అందాలే

అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే

వినిపించని రాగాలే...


చిత్రం : చదువుకున్నఅమ్మాయిలు (1963)

రచన : దాశరథి

సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

గానం : పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

ఆ... ఏమిటే...

ఏమిటి ఈ అవతారం? ఎందుకు ఈ సింగారం?

ఏమిటి ఈ అవతారం? ఎందుకు ఈ సింగారం?

పాత రోజులు గుర్తొస్తున్నవి ఉన్నది ఏదో వ్యవహారం

చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీ కోసం

చరణం : 1

పౌడరు దెచ్చెను నీకందం... బాగా వెయ్ వేలెడు మందం

పౌడరు దెచ్చెను నీకందం... బాగా వెయ్ వేలెడు మందం

తట్టెడు పూలు తలను పెట్టుకుని

తయారైతివా చిట్టి వర్థనం

చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీ కోసం

చరణం : 2

ఆ... ఆ... ఓ... ఓ...

వయసులోన నే ముదురుదాననా... వయ్యారానికి తగనిదాననా

వయసులోన నే ముదురుదాననా... వయ్యారానికి తగనిదాననా

వరుసకాన్పులై వన్నె తగ్గినా... అందానికి నే తీసిపోదునా

ఏమిటి నా అపరాధం ఎందుకు ఈ అవతారం

చరణం : 3

దేవకన్య ఇటు ఓహో

దేవకన్య ఇటు దిగివచ్చిందని భ్రమిసి పోదునా కలనైనా

మహంకాళి నా పక్కనున్నదని

మరచిపోదునా ఎపుడైనా

చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీ కోసం

చరణం : 4

నీళ్లు కలపని పాలవంటిది... పిండి కలపని వెన్నవంటిది

నీళ్లు కలపని పాలవంటిది... పిండి కలపని వెన్నవంటిది

నిఖారుసైనది నా మనసు... ఊరూవాడకు ఇది తెలుసు

ఏమిటి ఈ అవతారం?

చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీ కోసం


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)

రచన : కొసరాజు రాఘవయ్య చౌదరి

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : మాధవపెద్ది సత్యం, స్వర్ణలత

No comments:

Post a Comment