నిన్ను కోరేవర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
నిన్ను కోరే వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
చరణం : 1
ఉడికించే చిలకమ్మా నిన్నూరించే
ఒలికించే అందాలే ఆలాపించే
ముత్యాలా బంధాలే నీకందించే
అచ్చట్లూ ముచ్చట్లూ తానాశించే
మోజుల్లోనే చిన్నది నీవే తాను అన్నది
కలలే విందు చేసెనే నీలో పొందు కోరెనే
ఉండాలనీ నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు
నిన్ను కోరే వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
చరణం : 2
ఈ వీణా మీటేది నీవే నంట
నీ తలపూ నా వలపూ నీదేనంట
పరువాలా పరదాలు తీసేపూట
కలవాలీ కరగాలి నీలొనంట
పలికించాలి స్వాగతం పండించాలి జీవితం
నీకూ నాకూ ఈ క్షణం కానీ రాగసంగమం
నీ జ్ఞాపకం నాలోన సాగేనులే ఈవేళ సరసకు
నిన్ను కోరే వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
నిన్ను కోరే వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
చిత్రం : ఘర్షణ (1988)
రచన : రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
గానం : కె.ఎస్.చిత్ర
----
పాట - 2
పల్లవి :
ఒక బృందావనం... సోయగం...
ఎద కోలాహలం... క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం... సోయగం...
చరణం : 1
నే సందెవేళ జాబిలీ నా గీతమాల ఆమనీ
నా పలుకు తేనె కవితలే నా కులుకు చిలక పలుకులే
నే కన్న కలల మేడ నందనం
నాలోని వయసు ముగ్ధమోహనం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం సోయగం
చరణం : 2
నే మనసుపడిన వెంటనే ఓ ఇంద్రధనుసు పొందునే
ఈ వెండి మేఘమాలనే నా పట్టుపరుపు చేయునే
నే సాగు బాట జాజిపూవులే
నాకింక సాటిపోటి లేదులే
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం సోయుగం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం సోయగం
చిత్రం : ఘర్షణ (1988)
రచన : రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
గానం : వాణీ జయరాం
----
పాట - 3
పల్లవి :
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
చరణం : 1
ఆకులపై రాలు... ఆ... ఆ... ఆ.....
ఆకులపై రాలు హిమబిందువువోలె
నా చెలి ఒడిలోన పవళించినా
ఆకులపై రాలు హిమబిందువువోలె
నా చెలి ఒడిలోన పవళించినా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాణ్ణి ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళం...
నీవు నాకు వేద నాదం... ఆ... ఆ... ఆ...
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
చరణం : 2
కన్నుల కదలాడు ఆశలు శ్రుతి పాడు
వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేవిఁటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమలందించు సుధలేమిటో
పరవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం
ఆలపించే రాగ బంధం... ఆ... ఆ... ఆ...
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
చిత్రం : ఘర్షణ (1988)
రచన : రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, వాణీజయరాం
No comments:
Post a Comment