జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి... స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో... ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్నభూమి గొప్పదిరా
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
చరణం : 1
నీ తల్లి మోసేది నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి క డవరకురా కట్టె కాలే వరకురా
ఆ రుణం తలకొరివితో తీరేనురా
ఈ రుణం ఏ రూపాన తీరేనురా
ఆ రూపమే ఈ జవానురా
త్యాగానికి మరో రూపు నువ్వురా
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి... స్వర్గాదపీ గరీయసి
చరణం : 2
గుండె గుండెకు తెలుసు గుండెబరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండెకోత బాధెంతో
ఈ గుండె రాయి కావాలి
ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం... ఈ మనుషుల కోసం
ఈ మనుషుల కోసం
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి... స్వర్గాదపీ గరీయసి
చిత్రం : బొబ్బిలి పులి (1982)
రచన : దాసరి నారాయణరావు
సంగీతం : జె.వి.రాఘవులు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment