Wednesday, March 16, 2011

Desadrohulu (1964) - 2

పాట - 1
పల్లవి :

జగమే మారినది మధురముగా ఈ వేళ

జగమే మారినది మధురముగా ఈ వేళ

కలలూ కోరికలూ తీరినవి మనసారా

జగమే మారినది మధురముగా ఈ వేళ

చరణం : 1

మనసాడెనే మయూరమై

పావురములు పాడే... ఎల పావురములు పాడే

మనసాడెనే మయూరమై

పావురములు పాడే... ఎల పావురములు పాడే

ఇది చేరెను గోరువంక రామచిలుక చెంత

అవి అందాల జంట

ఇది చేరెను గోరువంక రామచిలుక చెంత

అవి అందాల జంట

నెనరూ కూరిమి ఈనాడే పండెను

నెనరూ కూరిమి ఈనాడే పండెను

జీవితమంతా చిత్రమైన పులకింత

జగమే మారినది మధురముగా ఈ వేళ

చరణం : 2

విరజాజులా సువాసన స్వాగతములు పలుక

సుస్వాగతములు పలుక

తిరిగాడెను తేనెటీగ తీయ్యదనము కోరి

అనురాగాల తేలి

ఎదలో ఇంతటి సంతోషమెందుకో

ఎదలో ఇంతటి సంతోషమెందుకో

ఎవ్వరికోసమో ఎందుకింత పరవశము

జగమే మారినది మధురముగా ఈ వేళ

కలలూ కోరికలూ తీరినవి మనసారా

జగమే మారినది మధురముగా ఈ వేళ


చిత్రం : దేశద్రోహులు (1964)

రచన : ఆరుద్ర

సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

గానం : ఘంటసాల, పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

ఆ... ఆ... ఆ...

జగమే మారినది మధురముగా ఈ వేళ

జగమే మారినది మధురముగా ఈ వేళ

కలలూ కోరికలూ తీరినవి మనసారా

జగమే మారినది మధురముగా ఈ వేళ

చరణం : 1

మనసాడెనే మయూరమై

పావురములు పాడే... ఎల పావురములు పాడే

మనసాడెనే మయూరమై

పావురములు పాడే... ఎల పావురములు పాడే

ఇది చేరెను గోరువంక రామచిలుక చెంత

అవి అందాల జంట

ఇది చేరెను గోరువంక రామచిలుక చెంత

అవి అందాల జంట

నెనరూ కూరిమి ఈనాడే పండెను

నెనరూ కూరిమి ఈనాడే పండెను

జీవితమంతా చిత్రమైన పులకింత

జగమే మారినది మధురముగా ఈ వేళ

చరణం : 2

విరజాజులా సువాసన స్వాగతములు పలుక

సుస్వాగతములు పలుక

తిరుగాడెను తేనెటీగ తీయదనము కోరి

అనురాగాల తేలి

కమ్మని భావమే కన్నీరై చిందెనే

కమ్మని భావమే కన్నీరై చిందెనే

ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి

జగమే మారినది మధురముగా ఈ వేళ

కలలూ కోరికలూ తీరినవి మనసారా

జగమే మారినది మధురముగా ఈ వేళ


చిత్రం : దేశద్రోహులు (1964)

రచన : ఆరుద్ర

సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

గానం : ఘంటసాల

No comments:

Post a Comment