జాబిలమ్మవో... జాజికొమ్మవో...
గాజుబొమ్మవో... ఓ మైనా ఐ లవ్ యూ
పచ్చబొట్టువో... పుట్టుమచ్చవో...
తేనెపట్టువో... ఐ డోన్ట్ నో వాట్ టు డూ
ఇంటి ముందు రంగవల్లివో ఓ చెలి
పెరటిలోని తులసిమొక్కవో
మందిరాన భక్తిపాటవో ఓ ప్రియా
పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై
ప్రాణమై నిలిచినావుగా
జాబిలమ్మవో... జాజికొమ్మవో...
గాజుబొమ్మవో... ఓ మైనా ఐ లవ్ యూ
చరణం : 1
ఓ... నీ పెదాలపైన నా పెదాలతోన
నీ పెదాలపైన నా పెదాలతోన
ఆ పదాలు నీకు రాసి చూపనా
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి
ఆ జగాలలోని ప్రేమ పంచనా
బొట్టుమీద ఒట్టుపెట్టనా కాటుకల్లె కావలుండనా
గుండెమీద ఒట్టుపెట్టనా అడుగులోన గూడుకట్టనా
జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా
జాబిలమ్మవో... జాజికొమ్మవో...
గాజుబొమ్మవో... ఓ మైనా ఐ లవ్ యూ
చరణం : 2
ఓ... నీ మనస్సులోకి నా మనస్సుచేరి
నీ మనస్సులోకి నా మనస్సుచేరి
ఆ తపస్సు చేసి ప్రేమపొందగా
నీ వయస్సుతోటి నా వయస్సుతోడై
నీ వయస్సుతోటి నా వయస్సుతోడై
ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా
ముత్యమంత ముద్దుపెట్టనా మూడుముళ్ళ బంధమేయనా
వెన్నెలంత ముద్దుపెట్టనా ఏడుజన్మలేకమవ్వనా
రేయికే రాజునై పగటికే బంటునై రాణికే రాజునవ్వనా
జాబిలమ్మవో... తాననాననా జాజికొమ్మవో...తాననాననా
గాజుబొమ్మవో... ఓ మైనా ఐ లవ్ యూ
చిత్రం : బన్ని(2005)
రచన : చంద్రబోస్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సాగర్, మహతి
No comments:
Post a Comment