Tuesday, March 15, 2011

Chudalani undi (1998) - 3

పాట - 1

పల్లవి :

సరిమామగారి సససనిదపసా... సరిమామగారి సససనిదపసా

రిమదానిదాప సాసనిదప మదపమరి

యమహానగరి కలకత్తా పురి...

యమహానగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి

యమహానగరి కలకత్తా పురి

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది

యమహానగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి

చరణం : 1

నే తాజీ పుట్టినచోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో

ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా

పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం

కడకు చేరాలి గమ్యం కదిలిపోరా

ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు

దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల

గజి బిజి ఉరుకుల పరుగులలో

యమహానగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది

యమహానగరి కలకత్తా పురి

చరణం : 2

బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలుపిల్ల మానిని సరోజిని

రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీగంధ సాగనీ

పదుగురు ప్రేమలే లేని లోకం దేవతా మార్కు మైకం

శరన్నవలాభిషేకం తెలుసుకోరా

కథలకు నెలవట కళలకు కొలువట

తిథులకు సెలవట అతిథుల గొడవట కలకట నగర పు కిటకిటలో

యమహానగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది

యమహానగరి కలకత్తా పురి

చరణం : 3

వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా

మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా

విను గురు సత్యజిత్‌రే సితార యస్ డి బర్మన్ కీ ధారా

థెరీసా కీ కుమారా కదలిరారా

జనగణమనముల స్వరపద వనముల

హృదయపు లయలను శ్రుతి పరిచిన

ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో

యమహానగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి

యమహానగరి కలకత్తా పురి

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది

చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది

యమహానగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి


చిత్రం : చూడాలనివుంది (1998)

రచన : వేటూరి

సంగీతం : మణిశర్మ

గానం : హరిహరన్

---

పాట - 2

పల్లవి :

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు

అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు

అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

చలిపులి పంజా విసిరితే సలసల కాగే వయసులో

గిలగిలలాడే సొగసుకే జోలాలీ

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు

అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

చరణం : 1

వాటేసుకో వదలకు వలపుల వల విసిరి

వాయించునీ మురళిని వయసుగాలి పోసి

దోచెయ్యనా దొరికితే దొరకని కోకసిరి

రాసేయ్యనా పాటలే పైటచాటు చూసి

ఎవరికి తెలియవు ఎద రస నసలు

పరువాలాటకు పానుపు పిలిచాకా

తనువు తాకిన తనివి తీరని వేళా

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు

అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

చరణం : 2

జాబిల్లితో జత కలు జగడపు రగడలతో

పొంకాలతో నిలు నిలు పొగడమాలలేసి

ఆకాశమే కులుకులు తొడిమెడు నడుమిదిగో

సూరీడునే పిలుపిలు చుక్కమంచు సోకి

అలకల చిలకలు చెలి రుసరుసలు

ఇక జాగెందుకు ఇరుకున పడిపోకా

మనసు తీరినా వయసులారని వేళా

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు

అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

చలిపులి పంజా విసిరితే సలసల కాగే వయసులో

గిలగిలలాడే సొగసుకే జో లాలీ

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు

అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు


చిత్రం : చూడాలనివుంది (1998)

రచన : వేటూరి

సంగీతం : మణిశర్మ

గానం : ఎస్.పి.బాలు, సుజాత

----

పాట - 3

పల్లవి :

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా

పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా

ముక్కుమీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల

గంగూలి సందులో గజ్జలగోల బెంగాలి చిందులో మిర్చిమసాలా

అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాలా

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా

పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా

చరణం : 1

గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మా

క్రి ష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో

దొంగిలించుకున్న సొత్తు గోవిందా

ఆవులించకుంటే నిద్దరౌతుందా

పుట్టి కొట్టే వేళా రైకమ్మో

చట్టి దాచి పెట్టు కోకమ్మో

క్రిష్ణా మురారి వాయిస్తావో చలి కోలాటమేదో ఆడిస్తావో

అరె ఆవోరీ భయ్యా బన్‌సి బజావో అరె ఆంధ్రా కన్హయ్యా హాత్ మిలావో

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా

పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా

చరణం : 2

ఓలమ్మో చోళీలో నా సోకు గోలమ్మో

ఓయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో

వేణువంటే వెర్రి గాలి పాటేలే

అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే

జట్టే కడితే జంట రావమ్మో పట్టు విడువు ఉంటే మేలమ్మో

ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టాలా పెళ్లాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా

అరె ఆయారే నాచ్‌కే ఆంధ్రావాలా అరె గావోరె విందు చిందు డబ్లీ గోల

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా

పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా గోపెమ్మా

ముక్కుమీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల

గంగూలి సందులో గజ్జలగోల బెంగాలి చిందులో మిర్చిమసాలా

అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాలా


చిత్రం : చూడాలని ఉంది (1998)

రచన : వేటూరి

సంగీతం : మణిశర్మ

గానం : ఉదిత్ నారాయణ్, స్వర్ణలత

No comments:

Post a Comment