Monday, March 21, 2011

Guppedu manasu (1979) - 2

పాట - 1
పల్లవి :

మౌనమె నీ భాష ఓ మూగమనసా

మౌనమె నీ భాష ఓ మూగమనసా

తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు

కల్లలు కాగానె కన్నీరౌతావు

మౌనమె నీ భాష ఓ మూగమనసా

ఓ మూగమనసా...

చరణం : 1

చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు

నాటకరంగానివే... మనసా తె గిన పతంగానివే

ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో

ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో

ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో

మౌనమె నీ భాష ఓ మూగమనసా

ఓ మూగమనసా...

చరణం : 2

కోర్కెల సెలవీవు... కూరిమి వల నీవు

ఊహల ఊయ్యాలవే... మనసా

మాయల దెయ్యానివే

లేనిది కోరేవు ఉన్నది వదిలేవు

ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమె నీ భాష ఓ మూగమనసా

తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు

కల్లలు కాగానె కన్నీరౌతావు

మౌనమె నీ భాష ఓ మూగమనసా

ఓ మూగమనసా...


చిత్రం : గుప్పెడు మనసు (1979)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

గానం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

----

పల్లవి :

నువ్వేనా... సంపంగి పువ్వుల నువ్వేనా

నువ్వేనా... సంపంగి పువ్వుల నువ్వేనా

జాబిల్లి నవ్వుల నువ్వేనా

గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

నువ్వేనా... సంపంగి పువ్వుల నువ్వేనా

జాబిల్లి నవ్వుల నువ్వేనా

గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

చరణం : 1

నిన్నేనా అది నేనేనా... కలగన్నానా కనుగొన్నానా

నిన్నేనా అది నేనేనా... కలగన్నానా కనుగొన్నానా

అల్లిబిల్లి పదమల్లేనా... అది అందాల పందిరి వేసేనా

అల్లిబిల్లి పదమల్లేనా... అది అందాల పందిరి వేసేనా

నువ్వేనా... సంపంగి పువ్వుల నువ్వేనా

జాబిల్లి నవ్వుల నువ్వేనా

గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

చరణం : 2

కళ్లేనా... కళ్లేనా హరివిల్లేనా... అది చూపేనా విరితూపేనా

కళ్లేనా... కళ్లేనా హరివిల్లేనా... అది చూపేనా విరితూపేనా

తుళ్లి తుళ్లి పడు వయసేనా... నను తొందర వందర చేసేనా

తుళ్లి తుళ్లి పడు వయసేనా... నను తొందర వందర చేసేనా

నువ్వేనా... సంపంగి పువ్వుల నువ్వేనా

జాబిల్లి నవ్వుల నువ్వేనా

గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

చరణం : 3

నువ్వైనా నీ నీడైనా... ఏనాడైనా నా తోడౌనా

నువ్వైనా నీ నీడైనా... ఏనాడైనా నా తోడౌనా

మళ్లీ మళ్లీ కలవచ్చేనా... ఇలా మల్లెల మాపై విచ్చేనా

మళ్లీ మళ్లీ కలవచ్చేనా... ఇలా మల్లెల మాపై విచ్చేనా

నువ్వేనా... సంపంగి పువ్వుల నువ్వేనా

జాబిల్లి నవ్వుల నువ్వేనా

గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

నువ్వేనా... సంపంగి పువ్వుల నువ్వేనా


చిత్రం : గుప్పెడుమనసు (1979)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment