Tuesday, March 29, 2011

illarikam (1959) - 2

పాట - 1
పల్లవి :

నిలువవే వాలు కనులదానా

వయ్యారి హంస నడకదానా

నీ నడకలో హొయలున్నదేచాన

నువు కులుకుతు గల గల నడుస్తు ఉంటే

నిలువదె నా మనసు

ఓ లలనా అది నీకే తెలుసు

నిలువవే వాలు కనులదానా

వయ్యారి హంస నడకదానా

నీ నడకలో హొయలున్నదే చాన

చరణం : 1

ఎవరని ఎంచుకొనినావో...

పరుడని భ్రాంతి పడినావో...

ఎవరని ఎంచుకొనినావో... భ్రాంతి పడినావో...

సిగ్గుపడి తొలగేవో

విరహాగ్నిలో నను తోసి పోయేవో

నువు కులుకుతు గల గల నడుస్తు ఉంటే

నిలువదె నా మనసు

ఓ లలనా అది నీకే తెలుసు

చరణం : 2

ఒకసారి నన్ను చూడరాదా...

చెంతజేరా సమయమిదికాదా...

ఒకసారి నన్ను చూడరాదా... సమయమిదికాదా...

చాలు నీ మర్యాదా

వగలాడి నే నీవాడనే కాదా

నువు కులుకుతు గల గల నడుస్తు ఉంటే

నిలువదె నా మనసు

ఓ లలనా అది నీకే తెలుసు

చరణం : 3

మగడంటే మోజులేనిదానా...

మనసుంటే నీకు నేను లేనా

మగడంటే మోజులేనిదానా... నీకు నేను లేనా...

కోపమా నా పైనా

నీ నోటి మాటకే నోచుకోలే నా

నిలువవే వాలు కనులదానా

వయ్యారి హంస నడకదానా

నీ నడకలో హొయలున్నదే చాన

నువు కులుకుతు గల గల నడుస్తు ఉంటే

నిలువదె నా మనసు

ఓ లలనా... ఓ చెలియా... ఓ మగువా... అది నీకే తెలుసు


చిత్రం : ఇల్లరికం (1959)

రచన : కొసరాజు

సంగీతం : టి.చలపతిరావు

గానం : ఘంటసాల

----

పాట - 2

పల్లవి :

భలేఛాన్స్... భలేచాన్సులే...

భలేచాన్సులే భలేచాన్సులే

లలలాం లలలాం లక్కీఛాన్సులే

భలేచాన్సులే...

ఇల్లరికంలో ఉన్న మజా...

ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే

భలేచాన్సులే...

చరణం : 1

అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే

అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే

బావమరదులే లేకుంటే ఇంటల్లుడిదేలే అధికారం

భలేచాన్సులే...

చరణం : 2

గంజిపోసినా అమృతంలాగా కమ్మగ ఉందనుకుంటే

బహుకమ్మగ ఉందనుకుంటే

చీ ఛా చీ ఛా అన్నా చిరాకు పడక

దులపరించుకు పోయేవాడికి భలేచాన్సులే

ఇల్లరికంలో ఉన్న మజా...

ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే

భలేచాన్సులే...

భలేచాన్సులే భలేచాన్సులే

లలలాం లలలాం లక్కీఛాన్సులే

భలేచాన్సులే...

ఇల్లరికంలో ఉన్న మజా...

ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే

భలేచాన్సులే...

చరణం : 3

జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వేలాడీ

జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వేలాడీ

దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలచేవాడికి...

భలేచాన్సులే...

చరణం : 4

అణిగీ మణిగీ ఉన్నామంటే అంతా మనకే చిక్కేది

అణిగీ మణిగీ ఉన్నామంటే అంతా మనకే చిక్కేది

మామలోభియై కూడబెట్టితే మనకే కాదా దక్కేది

అది మనకే కాదా దక్కేది

ఇహ మనకే కాదా దక్కేది

అది మనకే ఇహ మనకే

అది మనకే మనకే మనకే మనకే మ మ మ మనకే


చిత్రం : ఇల్లరికం (1959)

రచన : కొసరాజు

సంగీతం : టి.చలపతిరావు

గానం : మాధవపెద్ది సత్యం

No comments:

Post a Comment