Wednesday, March 16, 2011

Darling (2010) - 2

పాట - 1
పల్లవి :

ఇంకా ఏదో ఇంకా ఏదో

ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

సంకెళ్ళతో బంధించకు

ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు

తనలో నీ స్వరం వినరో ఈ క్షణం

అనుకుందేదీ నీలోనే నువు దాచకు

నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా

కనిపించాక మౌనాన్నే చూపించకు

ఇంకా ఏదో ఇంకా ఏదో

ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

చరణం : 1

మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ

జాబిల్లి చల్లేనా జడివాననీ

ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ

నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ

తీరమే ఓరినా తీరులో మారునా మారదూ ఆ ప్రాణం

ఇంకా ఏదో ఇంకా ఏదో

ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

చరణం : 2

వెళ్ళెళ్ళు చెప్పేసై ఏమవ్వదూ

లోలోన దాగుంటే ప్రేమవ్వదూ

అమృతం పంచడం నేరమే అవదురా

హాయినే పొందడం భారమే అవదురా

హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అందం

ఇంకా ఏదో ఇంకా ఏదో

ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

సంకెళ్ళతో బంధించకు

ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు

తనలో నీ స్వరం వినరో ఈ క్షణం

అనుకుందేదీ నీలోనే నువు దాచకు

నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా

కనిపించాక మౌనాన్నే చూపించకు

చిత్రం : డార్లింగ్ (2010)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం : జి.వి.ప్రకాష్‌కుమార్

గానం : సూరజ్, ప్రశాంతిని

----

పాట - 2

పల్లవి :

నీవే నీవే... నీవే నీవే...నీవే నీవే... నీవే నీవే...

నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా

ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా

ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా

కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా

మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా

మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా

నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

చరణం : 1

ఒక నిమిషములోన సంతోషం

ఒక నిమిషములోన సందేహం

నిదురన కూడ హే... నీ ధ్యానం

వదలదు నన్నే హో... నీ రూపం

ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే... చెలియా...

ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా

కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా

మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా

మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా

నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

చరణం : 2

నడకలు సాగేది నీ వైపే

పలుకులు ఆగింది నీ వల్లే

ఎవరికి చెబుతున్నా నీ ఊసే

చివరికి నేనయ్యా నీలానే

చుట్టూ అంతా తిట్టేస్తున్నా నేనే... విననే

ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా

కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా

మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా

మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా

నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా

ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా

చిత్రం : డార్లింగ్ (2010)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం, గానం : జి.వి.ప్రకాష్‌కుమార్

No comments:

Post a Comment