Thursday, March 31, 2011

Jagadeka veerudu athiloka sundari (1990) - 3

పాట - 1
పల్లవి :

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

అతిథిలా నను చేరుకున్న హృదయమా

బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా

మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా

ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా... ఆ...

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

అతిథిలా నను చేరుకున్న హృదయమా

ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా

కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా

ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా... ఆ...

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

చరణం : 1

నింగివీణకేమొ నేలపాటలొచ్చె తెలుగుజిలుగు అన్నీ తెలిసి

పారిజాతపువ్వు పచ్చిమల్లె మొగ్గ వలపే తెలిపే నాలో విరిసి

మచ్చలెన్నొ ఉన్న చందమామకన్న నరుడే వరుడై నాలో మెరిసే

తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనము నాలో మురిసే

మబ్బులన్ని వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం

తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం

రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో

రాయలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో

అడుగే పడక గడువే గడిచి పిలిచే

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

అతిథిలా నను చేరుకున్న హృదయమా

చరణం : 2

ప్రాణవాయువేదొ వేణువూదిపోయే శ్రుతిలో జతిలో నిన్నే కలిపి

దేవగానమంత ఎంకి పాటలాయె మనసు మమత అన్నీ కలిసి

వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయె బహుశా మనసావాచా వలచి

మేనకల్లే వచ్చి జానకల్లె మారె కులము గుణము అన్నీ కుదిరి

నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం

నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం

వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో

అమృతాల విందులో ఎందుకన్ని హద్దులో

జగమే అణువై యుగమే క్షణమై మిగిలే

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

అతిథిలా నను చేరుకున్న హృదయమా

బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా

మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా

ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా... ఆ...

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

అతిథిలా నను చేరుకున్న హృదయమా


చిత్రం : జగదేకవీరుడు-అతిలోకసుందరి (1990)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, జానకి, బృందం

----

పాట - 2

పల్లవి :

లలలా... లలా లలా లలా...

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

పువ్వూ నవ్వూ పులకించే గాలిలో

నింగీ నేలా చుంబించే లాలిలో

ఆనందాల దారే విహారమే

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

చరణం : 1

లతా లతా సరాగమాడే సుహసినీ సుమాలతో

వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో

మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా

తళతళా గళాన తటిల్లతా హారాలుగా

చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే

ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే

ఒక స్వరం తల వంచి ఇలచేరే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

పువ్వూ నవ్వూ పులకించే గాలిలో

నింగీ నేలా చుంబించే లాలిలో

ఆనందాల దారే విహారమే

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

చరణం : 2

సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా

సువర్ణికా సుగంధమేదో మనస్సునే హరించగా

మరాళినై ఇలాగే మరీమరీ నటించినా

విహారినై ఇవాళే దివీ భువీ స్పృశించినా

గ్రహముల పాడిన పల్లవికే జాబిలి వూగెనులే

కొమ్మలు తాకిన ఆవునికే కోయిల పుట్టెనులే

ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

నీలాకాశం దిగివచ్చే లోయలో

ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో

నాలో సాగే ఏదో సరాగమే

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం


చిత్రం : జగదేకవీరుడు-అతిలోక సుందరి (1990)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.జానకి, ఎస్.పి.బాలు

----

పాట - 3

పల్లవి :

అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

అబ్బనీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా

పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

చరణం : 1

చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా

ముసిరిన కసికసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా

కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు

ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు

చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట

అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా

వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా

చరణం : 2

అడగక అడిగినదే విఁటో లిపి చిలిపిగ ముదిరిన కవితగా

అది విని అదిమిన షోకులో పురి విడిచిన నెమలికి సవతిగా

నిన్నే నావి పెదవులు అవి నేడైనాయి మధువులు

రెండున్నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు

వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట

అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా

వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ


చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, చిత్ర

No comments:

Post a Comment