జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటినిండా నిదరోయే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
చరణం :
కన్నతల్లి ప్రేమకన్న అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి
కన్నతల్లి ప్రేమకన్న అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి
దేవతంటి అమ్మనీడే కోవెలే బిడ్డలకి
చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి
అమ్మచేతి కమ్మనైన దెబ్బకూడ దీవెన
బువ్వపెట్టి బుజ్జగించే లాలనెంతో తీయన
మంచుకన్న చల్లనైనా...
మల్లెకన్న తెల్లనైనా... అమ్మపాటే పాడుకోనా
మల్లెకన్న తెల్లనైనా... అమ్మపాటే పాడుకోనా
చిత్రం : చంటి (1992)
రచన : సాహితి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
----
పాట - 2
పల్లవి :
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటినిండా నిదరోయే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
చరణం :
వేమనయ్య నా గురువే... వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే... హాయి నిద్ర పాపలకే
వేమనయ్య నా గురువే... వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే... హాయి నిద్ర పాపలకే
కూనలమ్మ నా పదమే... తేనె కన్న తీయనిది
కోనలన్ని పాడుకొనే గువ్వ చిన్న పాట ఇది
రాగములు తాళములు నాకసలే రావులే
పాడుకొను ధ్యానమునే నాకొసగే దైవమే
ముద్దులోనే పొద్దుపోయే
కంటినిండా నిదరోయే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
చిత్రం : చంటి (1992)
రచన : సాహితి
సంగీతం : ఇళయరాజా
గానం : కె.యస్.చిత్ర
No comments:
Post a Comment