Wednesday, March 16, 2011

Dhanama-daivama (1973) - 1

పాట - 1
పల్లవి :

నీ మది చల్లగా స్వామి నిదురపో

దేవుని నీడలో వేదన మరచిపో

నీ మది చల్లగా...

చరణం : 1

ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు

ఏ సౌఖ్యములెందుకో ఆత్మ శాంతి లేనిదే

మనిషి బ్రతుకు నరకమౌను

మనసు తనది కానిదే

నీ మది చల్లగా స్వామి నిదురపో

దేవుని నీడలో వేదన మరచిపో

నీ మది చల్లగా...

చరణం : 2

చీకటి ముసిరినా వేకువ ఆగునా

ఏ విధి మారినా దైవం మారునా

కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో

నీ మది చల్లగా స్వామి నిదురపో

దేవుని నీడలో వేదన మరచిపో

నీ మది చల్లగా...

చరణం : 3

జానకి సహనము రాముని సుగుణము

ఏ యుగమైనను ఇలకే ఆదర్శము

వారి దారిలోన నడచు వారి జన్మ ధన్యము

నీ మది చల్లగా స్వామి నిదురపో

దేవుని నీడలో వేదన మరచిపో

నీ మది చల్లగా...


చిత్రం : ధనమా?-దైవమా? (1973)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : టి.వి.రాజు

గానం : పి.సుశీల

No comments:

Post a Comment