ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావెఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చరణం : 1
నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకై ఇలకై ఊయలూగింది కంటపడి
కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చరణం : 2
ఆ ఆ ఆ...
తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికే
అరెరే.. అరెరే.. నేడు కన్నీట తేనె కలిసే
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
మొహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
చిత్రం : బొంబాయి (1995)
రచన : వేటూరి
సంగీతం : ఎ.ఆర్.రహమాన్
గానం : హరిహరన్, చిత్ర
----
పాట - 2
సాకీ :
గుమ్‌సుమ గుమ్‌సుమ గుప్‌చుప్ గుమసుమ గుప్‌చుప్...
గుమ్‌సుమ గుమ్‌సుమ గుప్‌చుప్ గుమసుమ గుప్‌చుప్...
సలసల సలసల సక్కాలలాడి జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామా కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
మామా కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
పల్లవి :
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామైరె
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో
గమపమపా... ఆ... గమపమనీ... సనిపసనిపనీ మపగా
సగమపగాగమనిపానీ... సగమప సగమప ససానిసా ససానిసా
నిసానీసా నిసానీసా నిసానీసానీసనీసనీసనీసనీస నిసనీపమగ సపగమనిపగా... ఆ...
చరణం : 1
ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం...
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్లి పడసాగే
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగే దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలిమంట
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామైరె
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో
గుమ్‌సుమ గుమ్‌సుమ గుప్‌చుప్ గుమసుమ గుప్‌చుప్...
గుమ్‌సుమ గుమ్‌సుమ గుప్‌చుప్ గుమసుమ గుప్‌చుప్...
సలసల సలసల సక్కాలలాడి జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామా కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
మామా కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో
చరణం : 2
శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలూగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే
ఎడబాటనుకో ఎరమ్రల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామైరె
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
కన్నానులే...
చిత్రం : బొంబాయి (1995)
రచన : వేటూరి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : కె.ఎస్.చిత్ర, బృందం
No comments:
Post a Comment