Wednesday, March 16, 2011

Dana veera soora karna (1977) - 1

పాట - 1
పల్లవి :

చిత్రం... ఆయ్ భళారే విచిత్రం

చిత్రం... అయ్యారే విచిత్రం

ఈ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం

పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం

చిత్రం... ఆయ్ భళారే విచిత్రం

చరణం : 1

రాచరికపు జిత్తులతోరణతంత్రపుటెత్తులతో

రాచరికపు జిత్తులతో రణతంత్రపుటెత్తులతో

సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట

చిత్రం... ఆయ్ భళారే విచిత్రం

చరణం : 2

ఎంతటి మహరాజైన ఆ ఆ ఆ...

ఎంతటి మహరాజైన ఎపుడో ఏకాంతంలో

ఎంతో కొంత తన కాంతను

స్మరించుటే సృష్టిలోని చిత్రం

ఆయ్ భళారే విచిత్రం...

చరణం : 3

బింబాధర మధురిమలు... బిగి కౌగిలి ఘుమఘుమలు...

ఆ... ఆఆఆ... బింబాధర మధురిమలు బిగి కౌగిలి

ఇన్నాళ్ళుగ మాయురే

మేమెరుగక పోవుటే చిత్రం... ఆయ్ భళారే విచిత్రం

చరణం : 4

ఆఆఆ... వలపెరుగని వాడననీ ఏ ఏ...

వలపెరుగని వాడన ని పలికిన ఈ రసికమణీ

తొలిసారే ఇన్ని కళలు కురిపించుట

అవ్వ... నమ్మలేని చిత్రం అయ్యారే విచిత్రం

ఆయ్... భళారే విచిత్రం

అయ్యారే విచిత్రం.. అయ్యారే విచిత్రం..

అయ్యారే విచిత్రం..


చిత్రం : దానవీరశూరకర్ణ (1977)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

No comments:

Post a Comment