ఆ... ఆ... ఆ... ఆ... ఆ.....
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
చరణం : 1
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
తుళ్లి తుళ్లి గంతులు వేసే లేగకేది కట్టుబాటు
మళ్లి మళ్లి వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
చరణం : 2
ఓ తెమ్మెరా ఊపవే ఊహల ఊయల నన్ను
ఓ మల్లికా ఇవ్వవే నవ్వుల మాలిక నాకు
తల్లి మళ్లీ తరుణయ్యింది పువ్వు పూచి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
చిత్రం : ఇది కథ కాదు (1979)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : ఎస్.జానకి
No comments:
Post a Comment