కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమికావాలి స్వర్గం
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
చరణం : 1
జంతరల వంకలుండే నింగి కావాలి మాకు
వెండి వెన్నెల్లలోనె వెయ్యి కలలు పండాలి మాకు
పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చి
పాటలే పాడుకోవాలి అది చూసి నే పొంగిపోవాలి
మనసనే ఒక సంపదా ప్రతి మనిషిలోనూ ఉండనీ
మమతలే ప్రతి మనసులో కొలువుండనీ
మనుగడే ఒక పండగై కొనసాగనీ
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
చరణం : 2
ఓడిపోవాలి స్వార్ధం ఇల మరచిపోవాలి యుద్ధం
మరణమే లేని మానవులె ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపోనీ అమృతం పొంగిపోనీ
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడనీ ప్రతి నిత్యం
భేదమే ఇక తొలగనీ వేడుకే ఒక వెలగనీ
ఎల్లల పోరాటమే ఇక తీరనీ
ఎల్లరూ సుఖశాంతితో ఇక బతకనీ
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
చిత్రం : దొంగ దొంగ (1993)
రచన : రాజశ్రీ
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : మనో, చిత్ర
----
పాట - 2
పల్లవి :
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
చరణం : 1
వాగులై ఉరికితే వయసు కులుకే అని అర్ధం
కడలియె పొంగితే నిండు పున్నమేనని అర్ధం
ఈడు పకపక నవ్విందంటే ఊహు అని దానర్ధం
అందగత్తెకు అమై్మపుడితే ఊరికత్తని అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
చరణం : 2
పడవలె నదులకు బంధుకోటి అని అర్ధం
చినుకులె వానకు బోసినవ్వులే అని అర్ధం
వెల్లవేస్తే చీకటికి అది వేకువౌనని అర్ధం
ఎగిరితే నువు ఎముకలిరిస్తే
విజయమని దానర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
చిత్రం : దొంగ దొంగ (1993)
రచన : రాజశ్రీ
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : మనో
No comments:
Post a Comment