యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా... హహ హాహా...
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనమూ ఏలనో
వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏలనో... అహహా అహహా హహా
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏలనో...
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా... హహ హాహా...
ప్రేమయాత్రలకు బృందావనము
చరణం : 1
యవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి
ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా
చెలి నగుమోమే చంద్రబింబమై... పగలే వెన్నెల కాయగా
అహహా అహా అహహహా ఆహహ హా
చెలి నగుమోమే చంద్రబింబమై... పగలే వెన్నెల కాయగా
వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో సఖి రగలాలా
సఖి నెరిచూపుల చల్లదనంతో
జగములె ఊటీశాయగా
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా... హహ హాహా...
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనమూ ఏలనో
చరణం : 2
కన్నెప్రేమ లేని లేత కన్నె గువ్వకి నీకున్న ప్రేమ దోచి పెట్టవా
కన్నవారినే మరువ జేయుచూ... అన్ని ముచ్చటలు తీర్చనా
అహహా అహా అహహహా ఆహహ హా
కన్నవారినే మరువ జేయుచూ... అన్ని ముచ్చటలు తీర్చనా
ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులై నీ ఆదరణే
సతి ఆదర ణే పతికి మోక్షమని
సర్వశాస్తమ్రులు చాటగా
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా... హహ హాహా...
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనమూ ఏలనో
వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏలనో... అహహా అహహా హహా
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏలనో...
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో
ప్రేమయాత్ర చేద్దామా... హహ హాహా...
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనమూ ఏలనో
చిత్రం : డిటెక్టవ్ నారద (1992)
రచన : పింగళి, వంశీ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
No comments:
Post a Comment