Monday, March 21, 2011

Gulabi (1995) - 2

పాట - 1

పల్లవి :

మేఘాలలో తేలి పొమ్మన్నది

తుఫానులా రేగి పొమ్మన్నది

అమ్మాయితో సాగుతూ చిలిపి మది

బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది

బీట్ ఇన్ మై హార్ట్ వెంటపడి చుట్టుకుంది

ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ

బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది

బీట్ ఇన్ మై హార్ట్ వెంటపడి చుట్టుకుంది

ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ

చరణం : 1

హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు

ఆలాపిస్తువుంటే స్వాగతాల సంగీతాలు

ఆడగా నెమలి తీరుగ మనసు ఘల్ ఘల్ ఘల్లుమని

ఆకాశాన్నే హద్దు పావురాయి పాపాయికి

ఆగే మాటే వద్దు అందమైన అల్లరి

మారద వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని

ఓం నమః వచ్చిపడు ఊహలకు

ఓం నమః కళ్ళువీడు ఆశలకు

ఓం నమః ఇష్టమైన అలజడికి

చరణం : 2

మెచ్చినట్టే ఉంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు

వద్దంటున్నా విందే చెంగుమంటు చిందె ఈడు

గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటుపోతుంది

కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు

పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు

అంతగ బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది

నీ తరహా కొంప ముంచేటట్టే ఉంది

నా సలహా ఆలపిస్తే సేఫ్టీ ఉంది

ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది

బీట్ ఇన్ మై హార్ట్... బీట్ ఇన్ మై హార్ట్... ఓ మై గాడ్...


చిత్రం : గులాబి (1995)

రచన : సిరివెన్నెల

సంగీతం : శశిప్రీతమ్

గానం : మనో, గాయత్రి

----

పాట -

2

పల్లవి :

ఏ రోజైతే చూశానో నిన్ను ... ఆ రోజే నువ్వైపోయా నేను

ఏ రోజైతే చూశానో నిన్ను ... ఆ రోజే నువ్వైపోయా నేను

కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా... నీ ఊపిరినై నే జీవిస్తున్నాను...

నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో...

నీ రూపే నా వేచే గుండెల్లో...

నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే

ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా...

నీ కష్టంలో నేను ఉన్నాను...

కరిగే నీ కన్నీరౌతా నేను...

చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి

నీ ఏకాంతంలో ఓదార్పౌతాను

చరణం :

కాలం ఏదో గాయం చేసింది

నిన్నే మాయం చేశానంటోంది

లోకం నమ్మి అయ్యో అంటోంది

శోకం కమ్మి జోకొడతానంది

గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా

ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా...

నీతో గడిపినఆ నిమిషాలన్నీ...

నాలో మోగే గుండెల సవ్వడులే

అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగ

నువు లేకుంటే నేనంటూ ఉండనుగా

నీ కష్టంలో నేను ఉన్నాను...

కరిగే నీ కన్నీరౌతా నేను...

చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి

నీ ఏకాంతంలో ఓదార్పౌతాను

ఏ రోజైతే చూశానో నిన్ను ... ఆ రోజే నువ్వైపోయా నేను

కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా... నీ ఊపిరినై నే జీవిస్తున్నాను...


చిత్రం : గులాబి (1995)

రచన : సిరివెన్నెల

సంగీతం, గానం : శశిప్రీతమ్

No comments:

Post a Comment