ఎంతవారుగానివేదాంతులైనగాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో... కైపులో... కైపులో...
ఎంతవారుగాని వేదాంతులైనగాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో... కైపులో... కైపులో...
చరణం : 1
హోయ్ హోయ్ చిన్నది మేనిలో మెరుపున్నది
హఁ హఁ చేపలా తళుకన్నది హోయ్ సైపలేకున్నది
హోయ్ హోయ్ చిన్నది మేనిలో మెరుపున్నది
హఁ హఁ చేపలా తళుకన్నది హోయ్ సైపలేకున్నది
ఏవన్నెకాని వలపునమ్మి వలను చిక్కునో
కైపులో... కైపులో... కైపులో...
ఎంతవారుగాని వేదాంతులైనగాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో... కైపులో... కైపులో...
చరణం : 2
ఆడకు వయసుతో చెరలాడకు ఆహా...
ఆడితే వెనుకాడకు ఊహు... కూడి విడిపోకు
ఆడకు వయసుతో చెరలాడకు ఆహా...
ఆడితే వెనుకాడకు ఊహు... కూడి విడిపోకు
హే... మనసు తెలిసి కలిసిమెలిసి వలపునింపుకో
కైపులో... కైపులో... కైపులో...
ఎంతవారుగాని వేదాంతులైనగాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో... కైపులో... కైపులో...
చరణం : 3
బలే బలే లేత వయసుబికిందిలే
తాత మనసూరిందిలే లోకమింతేలే అహ్హహ...
బలే బలే లేత వయసుబికిందిలే
తాత మనసూరిందిలే లోకమింతేలే అహ్హహ...
హే... పాతరుచులు తలచి తలచి తాత ఊగెనోయ్
కైపులో... కైపులో... కైపులో...
ఎంతవారుగాని వేదాంతులైనగాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో... కైపులో... కైపులో...
చిత్రం : భలే తమ్ముడు (1969)
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు
గానం : మహమ్మద్ రఫీ
No comments:
Post a Comment