మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌనరాగాలెన్ని నాళ్లో
మంచు మబ్బుకమ్ముస్తుందో మత్తు మత్తు ఎన్నియల్లో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా
మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌనరాగాలెన్ని నాళ్లో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా
చరణం : 1
తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు
నా కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
లేత లేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు
ఓయమ్మా... ఆ ఆ ఆ...
హాయమ్మా వలపులే తొలిరేయమ్మా వాటేస్తే
చినవాడు నా సిగ్గు దోచేస్తే
మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌనరాగాలెన్ని నాళ్లో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా
చరణం : 2
తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
రాతి మనసున ప్రేమ అలజడి చిలికాడే చినవోడు
నా కంటి పాపకు కొంటె కలలను అలికాడే అతగాడు
వంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో
ఓయమ్మో... ఆ ఆ ఆ...
ఒళ్ళంతా మనసులే ఈ తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే శభలగ్నమేనాడో
మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌనరాగాలెన్ని నాళ్లో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా
చిత్రం : ఎగిరే పావురమా (1997)
రచన : వేటూరి
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గానం : సునీత
No comments:
Post a Comment