Monday, March 21, 2011

Gunasundari katha (1949) - 1

పాట - 1
పల్లవి :

ఈ వనిలో కోయిలనై కోయిలపాడే గానమునై

గానము కోరే చెవినై నా చెవిలో నేనే ధ్వనిస్తా

గానము కోరే చెవినైనా చెవిలో నేనే ధ్వనిస్తా

చరణం : 1

మింట తనే మేఘమునై మేఘములోని చంచలనై

చంచలకోరే గురినై నా గురిలో నేనే నటిస్తా

చంచలకోరే గురినైనా గురిలో నేనే నటిస్తా

చరణం : 2

నా హృదిలో మోహమునై మోహము చూపే ప్రేమమునై

ప్రేమనుకోరే ప్రియునై నా ప్రియుని నేనే వరిస్తా

ప్రేమనుకోరే ప్రియునైనా ప్రియుని నేనే వరిస్తా


చిత్రం : గుణసుందరి కథ (1949)

రచన : పింగళి నాగేంద్రరావు

సంగీతం : ఓగిరాల రామచంద్రరావు

గానం : టి.జి.కమలాదేవి

No comments:

Post a Comment