కోటలోని మొనగాడా కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా వేటకు వచ్చావా
జింకపిల్లకోసమో ఇంక దేనికోసమో
జింకపిల్లకోసమో ఇంక దేనికోసమో
తోటలోని చినదానా తోటలోని చినదానా
వేటకు వచ్చానే వేటకు వచ్చానే
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే
చరణం : 1
ఏలాటి పిల్ల అది ఏపాటి అందమది
ఏలాటి పిల్ల అది ఏపాటి అందమది
ఏ ఊరి చిన్నది ఏకోన ఉన్నది
ఏ ఊరి చిన్నది ఏకోన ఉన్నది
చారెడు కన్నులది చామంతి వన్నెలది
చారెడు కన్నులది చామంతి వన్నెలది
ఏ ఊరో ఏమో నా ఎదురుగనే ఉన్నది
ఏ ఊరో ఏమో నా ఎదురుగనే ఉన్నది
కోటలోని మొనగాడా కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా వేటకు వచ్చావా
జింకపిల్లకోసమో ఇంక దేనికోసమో
జింకపిల్లకోసమో ఇంక దేనికోసమో
చరణం : 2
కత్తులు వీరునికి కన్నె మనసెందుకో
జిత్తుల సిపాయికి చెలి వలపెందుకో
కత్తులు వీరునికి కన్నె మనసెందుకో
జిత్తుల సిపాయికి చెలి వలపెందుకో
కత్తుల ఒకచేత గుత్తులు ఒకచేత
కత్తుల ఒకచేత గుత్తులు ఒకచేత
నిలిపేబంటునే నీకు తగిన జంటనే
నీకు తగిన జంటనే...
కోటలోని మొనగాడా కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా వేటకు వచ్చావా
జింకపిల్లకోసమో ఇంక దేనికోసమో
జింకపిల్లకోసమో ఇంక దేనికోసమో
తోటలోని చినదానా తోటలోని చినదానా
వేటకు వచ్చానే వేటకు వచ్చానే
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే
చిత్రం : గోపాలుడు-భూపాలుడు (1967)
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : ఘంటసాల, పి.సుశీల
----
పల్లవి :
ఒకసారి కలలోకి రావయ్యా...
ఒకసారి కలలోకి రావయ్యా...
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా...
ఒకసారి రాగానే ఏమౌనులే
నీ హృదయాన శయనించి ఉంటానులే ఏలుకొంటానులే
ఒకసారి రాగానే ఏమవునులే... ఏ...
చరణం : 1
పగడాల నా మోవి చిగురించెరా
మోము చెమరించెరా మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా
సొగసు వేణువు చేసి పలికించరా
తెమ్మోవిపై తేనె ఒలికించనా
తెమ్మోవిపై తేనె ఒలికించనా
తనివి కలిగించనా మనసు కరిగించినా
కేరింత లాడించి సోలించనా
కేరింత లాడించి సోలించనా
ఒకసారి కలలోకి రావయ్యా... ఆ...
చరణం : 2
ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే
ఒగలు కురిపించవే మేను మరిపించవే
మరుపులో మధుకీల రగిలించవే
మరుపులో మధుకీల రగిలించవే
చిలిపి చూపుల సిగ్గు కదిలించరా
చిలిపి చూపుల సిగ్గు కదిలించరా
మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా
పదును తేలిన వలపు పండించరా
పదును తేలిన వలపు పండించరా
ఒకసారి కలలోకి రావయ్యా...
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా...
ఒకసారి రాగానే ఏమౌనులే... ఆఁ...
ఆఁ... ఆఁ... ఆఁ...
ఆహాహహా... ఆహ ఆహాహా...
ఓహోహోహో... ఓహో ఓహోహోహో...
చిత్రం : గోపాలుడు-భూపాలుడు (1967)
రచన : ఆరుద్ర
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : ఘంటసాల, ఎస్.జానకి
No comments:
Post a Comment