Wednesday, March 16, 2011

Dharma chakram (1996) - 2

పాట - 1
పల్లవి :

చెప్పనా చెప్పనా చిన్నమాట

చెప్పుకో చెప్పుకో ఉన్నమాట

చెప్పనా చెప్పనా చిన్నమాట

చెప్పుకో చెప్పుకో ఉన్నమాట

కళ్లలో మనసులో ఉన్నమాట

కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట

చెప్పనా చెప్పనా చిన్నమాట

చెప్పుకో చెప్పుకో ఉన్నమాట

చరణం : 1

నువ్వు నేను ఏకమంట నాకు నువ్వు లోకమంట కళ్లలోన ఇల్లు కట్టనా

ఇలాగే తడబడి రానా భలేగా ముడిపడిపోనా

వెన్నెలింట వద్దకొచ్చి కన్నెపైట కానుకిచ్చి వన్నెలన్ని అప్పగించనా

ఫలించే తపనల వెంటా వరించే పొరపడమంటా

సరేలే సరసాలమ్మో స్వరాలే పలకాలమ్మో

చలేసే నీరెండెల్లో కన్నె గుండెలో

చెప్పనా చెప్పనా చిన్నమాట

చెప్పుకో చెప్పుకో ఉన్నమాట

చరణం : 2

తేలిపోయే లేత ఒళ్లు వాలిపోయే చేప కళ్లు ఆకతాయి చెయ్ తాకితే

అదేదో తెలియని హాయి ఈడంటూ తెలిసినదోయి

అరెరెరెరెరే ఒద్దికైనా చోటు ఉంది సద్దులేని చాటు ఉంది ముద్దులిచ్చి పొద్దుపుచ్చనా

కులాసా కులుకులలోన భరోసా తెలుపగ రానా

ఎదల్లో సరాదాలయ్యో పదాలే ఎదిగేనయ్యో

చలాకీ నీ సందిట్లో ఎన్ని విందులో

చెప్పనా చెప్పనా చిన్నమాట

చెప్పుకో చెప్పుకో ఉన్నమాట

కళ్లలో మనసులో ఉన్నమాట

కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట

చెప్పనా చెప్పనా... ఊఁ...

చెప్పుకో చెప్పుకో... ఆహ హహా


చిత్రం : ధర్మచక్రం (1996)

రచన : చంద్రబోస్

సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ

గానం : ఎస్.పి.బాలు, ఎం.ఎం.శ్రీలేఖ

----

పాట - 2

పల్లవి :

సొగసు చూడ హాయి హాయిలే

తెలిసె నేడు ఇంత హాయి... హాయి హాయి

చెలియ చూపు నీకు హాయిలే

చెలిమిలోన ఉంది హాయి హాయి

అందాలు చూడ జన్మ చాలునా

అందించగానె ఆశ తీరునా

అహో ఇదెంత వింత మోహమో

సొగసు చూడ హాయి హాయిలే

తెలిసె నేడు ఇంత హాయి... హాయి హాయి

చరణం : 1

నువ్వంటే నేనంటు నేనంటే నువ్వుంటు నీవెంట నేనుండనా

నీ నవ్వే ముద్దంటు ఇంకేమి వద్దంటు ముడిపడనా

నీకోసం పుట్టాను నీ దారే పట్టాను నీమీదే ఒట్టేయనా

నా చేత చేయ్యెట్టు నన్నిట్టా జోకొట్టు ఒడిలోన

చెట్టా పట్టా కట్టేదెట్టో ఇట్టే చెప్పేయాలమ్మా

చెట్టు పుట్ట చూసే వేళ తప్పేదెట్టయ్యా

కుమారి చెంపకెన్ని కెంపులో

వరించు కళ్లకెన్ని రంగులో

అహో ఇదెంత వింత మోహమో

సొగసు చూడ హాయి హాయిలే

తెలిసె నేడు ఇంత హాయి... హాయి హాయి

చరణం : 2

నా పాలబుగ్గల్లో దీపాల సిగ్గుల్లో నీపాలు పంచివ్వనా

ఈ వెండి వెన్నెల్లో నీ గుండె చప్పుళ్లు వినలేనా

హద్దుల్ని దాటాలి వద్దన్న చూడాలి నీ కన్నె కవ్వింపులు

కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి పదనిసలు

నిన్న మొన్న లేనేలేని వైనం ఎంతో బాగుంది

వన్నె చిన్నె ఊరించాకే ప్రాణం లాగింది

సయ్యాటలాడ ఎంత తొందరో

వయ్యారి ఈడుకెన్ని చిందులో

సుఖాల తీరమెంత దూరమో

సొగసు చూడ హాయి హాయిలే

తెలిసె నేడు ఇంత హాయి... హాయి హాయి

చెలియ చూపు నీకు హాయిలే

చెలిమిలోన ఉంది హాయి హాయి

అందాలు చూడ జన్మ చాలునా

అందించగానె ఆశ తీరునా

అహో ఇదెంత వింత మోహమో


చిత్రం : ధర్మచక్రం (1996)

రచన : చంద్రబోస్

సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ

గానం : ఎస్.పి.బాలు, చిత్ర

No comments:

Post a Comment