Wednesday, March 30, 2011

Indradhanussu (1978) - 1

పాట - 1
పల్లవి :

నేనొకప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని...

చరణం : 1

తలపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా

పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా

తలపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా

పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది..

నేనొక ప్రేమ పిపాసిని...

చరణం : 2

పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను

ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను

నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను

నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను

నేనొక ప్రేమ పిపాసిని...

చరణం : 3

పగటికి రేయి.. రేయికి పగలు.. పలికే వీడ్కోలు

సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు

నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు

నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని...


చిత్రం : ఇంద్రధనుస్సు (1978)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment