Tuesday, March 15, 2011

Chiranjeevulu (1956) - 1

పాట - 1
పల్లవి :

కనుపాప కరవైన కనులెందుకో

తనవారెపరులైన బ్రతుకెందుకో

కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో

చరణం : 1

విరజాజి శిలపైన రాలేందుకే

మరుమల్లె కెంధూళి కలసేందుకే

విరజాజి శిలపైన రాలేందుకే

మరుమల్లె కెంధూళి కలసేందుకే

మనపైన చినదాని మనసిందుకే

రగిలేందుకే...

కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో

చరణం : 2

అలనాటి మురిపాలు కలలాయెనా

చిననాటి కలలన్ని కథలాయెనా

అలనాటి మురిపాలు కలలాయెనా

చిననాటి కలలన్ని కథలాయెనా

తలపోసి తలపోసి కుమిలేందుకా

తనువిందుకా...

కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో

చరణం : 3

తన వారు తనవారె విడిపోరులే

కనుమూసి గగనాన కలసేరులే

తన వారు తనవారె విడిపోరులే

కనుమూసి గగనాన కలసేరులే

ఏనాటికైనాను నీదాననే నీదాననే

చిననాటి మనపాట మిగిలేనులే

కలకాలమీ గాథ రగిలేనులే... కలకాలమీ గాథ రగిలేనులే

రగిలేనులే...

కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో


చిత్రం : చిరంజీవులు (1956)

రచన : మల్లాది రామకృష్ణశాస్ర్తి

సంగీతం : ఘంటసాల

గానం : ఘంటసాల, పి.లీల

No comments:

Post a Comment