Wednesday, March 16, 2011

Dasavatharam (2008) - 2

పాట - 1

పల్లవి :

ఓం... నమో నారాయణాయ

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు

దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు

దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే

అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే

వంకర కన్నుల మీరు శంకర కింకరులు

వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు

చరణం : 1

నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే

నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే

నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే

నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే

నిలువునా నువు చీల్చుతున్నా మాట మార్చనులే

వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులే

ప్రభువు ఆనతికి జడిసేనాడు పడమట సూర్యుడు పొడవడులే

రాజ్యలక్ష్మి నాథుడు శ్రీనివాసుడే

శ్రీనివాసుడి వారసుడీ విష్ణుదాసుడే

దేశాన్నేలే వారంతా రాజ్య దాసులే

రాజులకు రాజు ఈ రంగరాజనే

చరణం : 2

నీటిలోన ముంచినంత నీతి చావదులే

గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే

నీటిలోన ముంచినంత నీతి చావదులే

గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే

దివ్వెలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా

నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా

శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట

దైవం కోసం పోరే సమయం లేదంట

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు

దేవుని మాత్రం కంటే దేహం కనరాదు


చిత్రం : దశావతారం (2008)

రచన : వెన్నెలకంటి

సంగీతం : హిమేష్ రేష్మియా

గానం : హరిహరన్, బృందం

----

పల్లవి :

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

వెన్న దొంగవైనా మన్ను తింటివా

కన్నె గుండె ప్రేమ లయలా మృదంగానివా

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

జీవకోటి నీ చేతి తోలుబొమ్మలే

నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

చరణం : 1

నీలాల నింగి కింద తేలియాడు భూమి

తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి

పడగ విప్పి మడుగన లేచే సర్పశేషమే ఎక్కి

నాట్యమాడి కాలేయునిదర్పమణిచాడు

నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా

అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా

అట అర్జునుడొందెను నీ దయవల్ల గీతోపదేశం

జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం

వేదాల సారమంతా వాసుదేవుడే

రేపల్లె రాగం తానం రాజీవమే

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

చరణం : 2

మత్స్యమల్లె నీటిన తేలి వేదములను కాచి

కూర్మరూప ధారివి నీవై భువిని మోసినావే

వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే

నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు

రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు

కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు

ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే

నీ ఒరవడి పట్టి ముడిపడివుంటా ఏదేమైనా నేనే

మదిలోని ప్రేమ నీవే మాధవుడా

మందార పువ్వే నేను మనువాడరా...

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

ఎక్కడో ఎక్కడో నా బిడ్డ తల్లో

ఇంకా రాలే ధమరుకలో

గగనం నుంచి వచ్చే ధీరుడు

చెప్పేవన్నీ సన్నాసులు

రారా వరదా త్వరగా రారా

ఇపుడే రారా... రారా...

గోవిందా... గోపాలా...

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బృందావనంలో వరంగా


చిత్రం : దశావతారం (2008)

రచన : వేటూరి

సంగీతం : హిమేష్ రేష్మియా

గానం : సాధనా సర్గమ్, బాలు


No comments:

Post a Comment