ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా
ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా
కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి
కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి
స్వాగతం చెబుతున్నా నేనే పసివాణ్ణై నీ నీడ చేరుకున్నా
జీవితాన ప్రతి పాఠం చేదే అనుకున్నా
తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా
అనుబంధపు తీరానికి నడిపించిన గురువని
అనుబంధపు తీరానికి నడిపించిన గురువని
వందనం చేస్తున్నా నేనే గురుదక్షిణగా అంకితమౌతున్నా
ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా
చరణం : 1
ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలని
ఆపదలో పడనీయక దీపం చూపాలని
ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలని
ఆపదలో పడనీయక దీపం చూపాలని
వచ్చిన ఈ పిచ్చి తండ్రి పితృ ఋణం తీర్చి
చల్లారిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి
తోడైన నీ ముందు ఓడానా గెలిచానా
ఒకే తండ్రి నుంచి రెండు జన్మలందుకున్నా
తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా
ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా
చరణం : 2
పగలే గడిచింది పడమర పిలిచింది
వయసు పండి వాలుతున్న సూర్యుణ్ణి నేను
కాచుకున్న కాళరాత్రి గెలిచే సులువేమిటో
కాటుక నది ఈదొచ్చిన నువ్వు చెప్పు వింటాను
రాతిరి కరిగింది తూరుపు దొరికింది
కళ్లు తెరిచి ఇపుడిపుడే ఉదయిస్తున్నాను
అచ్చమైన స్వచ్ఛమైన తెలుపంటే ఏఁవిటో
మచ్చలేని నీ మనసును అడిగి తెలుసుకుంటాను
ఇన్నాళ్ల మన దూరం ఇద్దరికీ గురువురా
ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా
పాఠాలు ఏవైనా నీతి ఒక్కటే నాన్నా
చీకట్లు చీల్చడమే ఆయుధమేదైనా
చిత్రం : ఇద్దరూ ఇద్దరే (1990)
రచన : సిరివెన్నెల
సంగీతం : రాజ్-కోటి
గానం : ఎస్.పి.బాలు, మనో
No comments:
Post a Comment