కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్...
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్...
సుడిలో దూకి ఎదురీదకా... సుడిలో దూకి ఎదురీదకా...
మునకే సుఖమనుకోవోయ్... మునకే సుఖమనుకోవోయ్...
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్...
చరణం : 1
మేడలోని అలపైడిబొమ్మా నీడనే చిలకమ్మా...
మేడలోని అలపైడిబొమ్మా నీడనే చిలకమ్మా...
కొండలే రగిలే వడగాలి... కొండలే రగిలే వడగాలి...
నీ సిగలో పూవేనోయ్... నీ సిగలో పూవేనోయ్...
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్...
చరణం : 2
చందమామ మసకేసిపోయే
ముందుగా కబురేలోయ్... ముందుగా కబురేలోయ్...
లాహిరి నడిసంద్రములోన... లాహిరి నడిసంద్రములోన...
లంగరుతో పనిలేదోయ్... లంగరుతో పనిలేదోయ్...
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్...
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్...
చిత్రం : దేవదాసు (1953)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : సి.ఆర్.సుబ్బరామన్
గానం : ఘంటసాల
----
పాట - 2
పల్లవి :
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సార మింతేనయా ... ఈ వింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సార మింతేనయా ... ఈ వింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సార మింతేనయా ... ఈ వింతేనయా
చరణం : 1
కలిమిలేములు కష్టసుఖాలు
కలిమిలేములు కష్టసుఖాలు
కావడిలో కుండలని భయమేలోయి
కావడిలో కుండలని భయమేలోయి
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయీ ఈ వింతేనోయీ
కనుగొంటే సత్యమింతేనోయీ ఈ వింతేనోయీ
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సార మింతేనయా ... ఈ వింతేనయా
చరణం : 2
ఆశా మోహముల దరిరానీకోయీ
ఆశా మోహముల దరిరానీకోయీ
అన్యులకే నీ సుఖము అంకితమోయీ
అన్యులకే నీ సుఖము అంకితమోయీ
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సార మింతేనయా ... ఈ వింతేనయా
జగమే మా...య... బ్రతుకే మా...య...
చిత్రం : దేవదాసు (1953)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : సి.ఆర్.సుబ్బరామన్
గానం : ఘంటసాల
----
పాట - 3
పల్లవి :
అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
అనుపల్లవి :
పొంగారే సోయగము రంగుచేయగా
పొంగారే సోయగము రంగు చేయగా
రంగరంగేళిగా ఆడి పాడేనయ్యా
రంగరంగేళిగా ఆడి పాడేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
చరణం : 1
ముల్లోకాలా మేని సల్లాపాలా ఉంచి తేలించే లాలించేనయ్యా
ముల్లోకాలా మేని సల్లాపాలా ఉంచి తేలించే లాలించేనయ్యా
పూలజంపాలలో తూగుటుయ్యాలలో
పూలజంపాలలో తూగుటుయ్యాలలో
నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా
నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
చరణం : 2
హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాణనయ్యా
హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాణనయ్యా
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగ
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగ
హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా
హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
పొంగారే సోయగము రంగు చేయగా
రంగరంగేళిగా ఆడి పాడేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా
చిత్రం : దేవదాసు(1953)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : సి.ఆర్.సుబ్బరామన్
గానం : రావుబాలసరస్వతీదేవి
(గమనిక : టైటి ల్‌లో సి.ఆర్.సుబ్బరామన్ పేరు ఉన్నా వాస్తవానికి ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎస్.విశ్వనాథన్ స్వరపరిచారు)
----
పాట - 4
పల్లవి :
అంతా భ్రాంతియేనా...జీవితాన వెలుగింతేనా...
ఆశా నిరాశేనా... మిగిలేది చింతేనా
అంతా భ్రాంతియేనా... జీవితాన వెలుగింతేనా...
ఆశా నిరాశేనా... మిగిలేది చింతేనా
చరణం : 1
చిలిపి తనాల చెలిమే మరచితివో
చిలిపి తనాల చెలిమే మరచితివో
తలిదండ్రుల మాటే దాట వెరచితివో
తలిదండ్రుల మాటే దాట వెరచితివో
పేదరికమ్ము ప్రేమపథమ్ము మూసి వేసినదా
నా ఆశే దోచినదా...
అంతా భ్రాంతియేనా... జీవితాన వెలుగింతేనా...
ఆశా నిరాశేనా... మిగిలేది చింతేనా
చరణం : 2
మనసున లేని వారి సేవలతో
మనసున లేని వారి సేవలతో
మనసీయగ లేని నీపై మమతలతో
మనసీయగ లేని నీపై మమతలతో
వంతల పాలై చింతిలుటే నావంతా దేవదా
నా వంతా దేవదా...
అంతా భ్రాంతియేనా... జీవితాన వెలుగింతేనా...
ఆశా నిరాశేనా... మిగిలేది చింతేనా
చిత్రం : దేవదాసు (1953)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : సి.ఆర్.సుబ్బరామన్
గానం : కె.రాణి
No comments:
Post a Comment