తనానా నిజంగా తానానానా చెప్పాలంటే
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పేవుంటే క్షమించు
చిరాకే తెప్పించానంటే క్షమించు
నీ మనస్సే నొప్పించానంటే క్షమించు
దయచేసి ఎక్స్‌క్యూజ్ మి దరిచేరి ఫర్‌గివ్ మి ఒకసారి బిలీవ్ మి
పాట ఆలకించు నా మనవి చిత్తగించు
కాస్త హెచ్చరించు త ర్వాత బుజ్జగించు
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పేవుంటే క్షమించు
చరణం : 1
పెదాల్లోని తొందరపాటే పదాల్లోని వేగిరపాటే
నిదానించి బతిమాలాయి క్షమించు
పదారేళ్ల అనుమానాలే తుదేలేని ఆలోచనలే
తలొంచేసి నించున్నాయి క్షమించు
చూపులలో మన కలిగిన మార్పును సూటిగ గమనించు
చెంపల వెలుపుల పొంగిన రంగును నీరుగ గుర్తించు
హృదయం అంతట నిండిన ప్రతిమను మెప్పించు ఆపైన ఆలోచించు
నిజంగా క్షమించు... ఓహో... నిజంగా క్షమించు...
చరణం : 2
తగాదాలే చెలిమికి నాంది
విభేదాలే ప్రేమ పునాది
గతం అంతా మంచికి అనుకొని క్షమించు
తపించేటి ఈ పాపాయిని
భరించేటి ఈ ముద్దాయిని
ప్రియా అంటూ ముద్దుగ పిలిచి క్షమించు
పిడికెడు గుండెను చీకటి బోలెడు భారం తగ్గించు
ఇరువురి నడుమన ఇంత కు ఇంత దూరం తొలగించు
అణువణువణువున మమతల చెరలో బంధించు వందేళ్లు ఆనందించు
నిజంగా క్షమించు... నిజంగా క్షమించు...
లలాలాలాలాలాలా క్షమించు...
దయచేసి ఎక్స్‌క్యూజ్ మి దరిచేరి ఫర్‌గివ్ మి ఒకసారి బిలీవ్ మి
పాట ఆలకించు నా మనవి చిత్తగించు
కాస్త హెచ్చరించు త ర్వాత బుజ్జగించు
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పేవుంటే క్షమించు
చిత్రం : దేవదాసు (2006)
రచన : చంద్రబోస్
సంగీతం : చక్రి
గానం : కౌసల్య
No comments:
Post a Comment