గోరువంక వాలగానెగోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలా కిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై...
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలా కిలా పువ్వులే పుట్టలేదా
చరణం : 1
ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన..
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళలోన ఎల్లకిల్లా పడ్డట్టున్న
అల్లొమల్లొఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మ
అబ్బాయంటే సూరీడమ్మ
ఇంటి దీపమవ్వాలంటా దిక్కుల్లో
ఎవరికి వారే.. యుమునకు మీరే..
రేవు మీద నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలా కిలా పువ్వులే పుట్టలేదా
చరణం : 2
ప్రేమ రుతువులు పూలు తొడిగిన తేనె వునసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన పూలసొగసుల బాటల్లో
బుగ్గందాల ఏరు నవ్వె సిగ్గందాల పిల్లనవ్వె
బాలయ్యొచ్చి కోలాటాడె వేళల్లో
పైరందాల చేలు నవ్వె పేరంటాల పూలు నవ్వె
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడె పొద్దుల్లో
పరవశమేదో ఓ.. పరిమళమాయె.. ఏ.. ఏ.. ఓ..
పువ్వు నవ్వె దివ్వె నవ్వె... జివ్వుమన్న జన్మ నవ్వె పాడుతుంటే...
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలా కిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యవూడగా
వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై...
చిత్రం: గాండీవం (1994)
రచన : వేటూరి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : బాలు, ఎం.జి.శ్రీకుమార్, చిత్ర
No comments:
Post a Comment