Wednesday, March 16, 2011

Devudu chesina manushulu (1973) - 1

పాట - 1
పల్లవి :

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల

మాపటేళకలుసుకో...

నీ మనసైనది దొరుకుతుంది

మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది

ఓకే... యా...

యా యా... యయాయయాయా...

యా యా... యయాయయాయా... హా...

చరణం : 1

మా దేశం వచ్చినవాడా మా బొమ్మలు మెచ్చినవాడా

మా దేశం వచ్చినవాడా మా బొమ్మలు మెచ్చినవాడా

తరతరాల అందాల తరగని తొలి చందాల

తరతరాల అందాల తరగని తొలి చందాల

ఈ భంగిమ నచ్చిందా ఆనందం ఇచ్చిందా అయితే... ఏ ఏ...

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల

మాపటేళ కలుసుకో...

నీ మనసైనది దొరుకుతుంది

మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది

ఓకే... యా...

యా యా... యయాయయాయా...

యా యా... యయాయయాయా... హా...

చరణం : 2

సోద్యాలు వెతికేవాడా సొగసు చూసి మురిసేవాడా

సోద్యాలు వెతికేవాడా సొగసు చూసి మురిసేవాడా

కళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల

కళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల

నీ ముందుకు రావాలా నీ సొంతం కావాలా అయితే... ఏ ఏ...

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల

మాపటేళ కలుసుకో...

నీ మనసైనది దొరుకుతుంది

మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది

ఓకే... యా...

యా యా... యయాయయాయా...

యా యా... యయాయయాయా... హా...


చిత్రం : దేవుడు చేసిన మనుషులు (1973)

రచన : ఆరుద్ర

సంగీతం : రమేష్‌నాయుడు

గానం : ఎల్.ఆర్.ఈశ్వరి

No comments:

Post a Comment