లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
వీలుంటే చిరుమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే
లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
వీలుంటే చిరుమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే
చరణం : 1
చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటేసుడిగాలై చుట్టేయాలి లేలే
గొడుగల్లే పనిచెయ్యాలి నిన్నే కదిలిస్తుంటే పడగల్లే పనిపట్టాలి లేలే
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి
అణిచేస్తే ముంచెయ్యాలి లే...
నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి
విసిగిస్తే భూకంపాలే చూపాలే...
లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
చరణం : 2
చెడు ఉంది మంచి ఉంది అర్థం వేరే ఉంది
చెడ్డోళ్లకి చెడు చేయడమే మంచి
చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది చేదన్నది ఉన్నపుడేగా తీపి
ఎడముంది కుడివుంది కుడి ఎడమయ్యే గొడవుంది
ఎడముంది కుడివుంది కుడి ఎడమయ్యే గొడవుంది
ఎటుకైనా గమ్యం ఒకటేలే...
బ్రతుకుంది చావుంది చచ్చేదాకా బ్రతుకుంది
చచ్చాకా బ్రతికేలాగ బ్రతకాలే...
లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
వీలుంటే చిరుమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే
చిత్రం : గుడుంబా శంకర్ (2004)
రచన : చంద్రబోస్
సంగీతం : మణిశర్మ
గానం : కె.కె.
----
పాట - 2
పల్లవి :
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నీనైనా అదినీ
ఏమంటారో మారిపోతున్నా కథనీ
ఏమంటారో జారిపోతున్నా మదినీ
చూసే పెదవినీ మాటాడే కనులనీ
నవ్వే నడకనీ కనిపించే శ్వాసనీ
ఇచ్చి పుచ్చుకున్న మనసుని ఇదా అదా ఎదా విదా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నీనైనా అదినీ
ఏమంటారో మారిపోతున్నా కథనీ
ఏమంటారో జారిపోతున్నా మదినీ
చరణం : 1
ఎదురుగా వెలుగుతున్నా నీడని
బెదురుగా కలుగుతున్నా హాయిని హొ హో...
తనువున తొనుకుతున్నా చురుకునీ
మనసున మసురుకున్నా చెమటనీ
ఇష్టకష్టాలని ఇపుడెమంటారో
ఈ మొహమాటాలని మరి ఏమంటారో
స్వల్ప భారాలని ఇపుడెమంటారో
సమీప దూరాలని అసలేమంటారో
జారే నింగినీ దొరలాంటి ఈ దొంగని
పాడే కొంగుని పరిమళించే రంగుని
పొంగుతున్నా సుధా గంగనీ
ఇదా అదా అదే ఇదా మరి
ఏమంటారో మారిపోతున్నా కథనీ
ఏమంటారో జారిపోతున్నా మదినీ
చరణం : 2
జాబిలై తళకుమన్నా చుక్కని
బాధ్యతై దొరుకుతున్నా హక్కుని హె హే...
దేవుడై ఎదుగుతున్నా భక్తునీ
సూత్రమై బిగియనున్నా సాక్షినీ
పాతలో కొత్తనీ ఇపుడెమంటారో
పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో
తప్పులో ఒప్పుని ఇపుడెమంటారో
గత జన్మలో అప్పుని అసలేమంటారో
నాలో నువ్వుని ఇక నీలో నేనునీ
మాకే మేమని మనదారే మనదనీ
రాసుకున్నా ఆత్మ చరితని అదా ఇదా ఇదే ఎదా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నీనైనా అదినీ
ఏమంటారో మారిపోతున్నా కథనీ
ఏమంటారో జారిపోతున్నా మదినీ
చిత్రం : గుడుంబా శంకర్ (2004)
రచన : చంద్రబోస్
సంగీతం : మణిశర్మ
గానం : ఎస్.పి.చరణ్, హరిణి
No comments:
Post a Comment